పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి . సెప్టెంబర్ 3 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా మలికిపురంలోని శ్రీ దీప్తి కళాశాలలో ఆల్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోలిశెట్టి గణేష్ నేతృత్వంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.మలికిపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు,వివిధ పాఠశాలలు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు, అలాగే సుమారు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారం అని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవతా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు.తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువులదేనని వక్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆల్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.వి.ఎస్. గణేష్ పొలిశెట్టి మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా, నైతిక విలువలు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం మరియు మంచి సంస్కారం కలిగిన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి గురువుకు ఉంది. గురువు చెప్పే పాఠాలు కేవలం పుస్తకాల్లోని విషయాలకే పరిమితం కాకుండా, జీవితాన్ని ఎలా నడిపించాలో కూడా నేర్పుతాయి.అందుకే ప్రతి విద్యార్థి తన జీవితంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎల్లప్పుడూ గౌరవంతో స్మరించుకోవాలని గణేష్ పొలిశెట్టి పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాలుగు మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 50 మంది విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.మలికిపురంలో ఆల్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు విద్యావేత్తలు అభినందించారు. విద్యారంగానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మలికిపురం మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ ,వై. సత్యనారాయణ ,రాజోలు ఎంఈఓ ప్రసాద్,మామిడికుదురు మండలం ఎంఈఓ శ్రీనివాస్. శ్రీ దీప్తి కళాశాల ప్రిన్సిపాల్ సుధ,తదితర విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆల్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి