Sunday, 23 August 2026
  • Home  
  • పశుగ్రాస లభ్యతపై ఇంటింటా సర్వే..!
- అనకాపల్లి

పశుగ్రాస లభ్యతపై ఇంటింటా సర్వే..!

అనకాపల్లి, ఆగస్టు 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) సత్యనారాయణపురం గ్రామంలో ప్రత్యేక అధికారి, AD, DAH డాక్టర్ పద్మలత ఇంటింటా పశుగ్రాస సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులతో నేరుగా మాట్లాడి పశుగ్రాస లభ్యత, అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ పద్మలత సూచించారు. పశువులకు నీడ, శుభ్రమైన నీరు, నాణ్యమైన పచ్చి పశుగ్రాసం అందించాలని తెలిపారు. అజోల్లా, మాగుడి గడ్డి వంటి పశుగ్రాసాలను వినియోగించాలని, పాకల్లో గాలి ప్రసరణ ఉండేలా చూడాలని సూచించారు. పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవరపాలెం పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్, AHAలు ఈశ్వర్, సాగర్, వెంకట్ పాల్గొన్నారు.

అనకాపల్లి, ఆగస్టు 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)

సత్యనారాయణపురం గ్రామంలో ప్రత్యేక అధికారి, AD, DAH డాక్టర్ పద్మలత ఇంటింటా పశుగ్రాస సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులతో నేరుగా మాట్లాడి పశుగ్రాస లభ్యత, అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేశారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ పద్మలత సూచించారు. పశువులకు నీడ, శుభ్రమైన నీరు, నాణ్యమైన పచ్చి పశుగ్రాసం అందించాలని తెలిపారు. అజోల్లా, మాగుడి గడ్డి వంటి పశుగ్రాసాలను వినియోగించాలని, పాకల్లో గాలి ప్రసరణ ఉండేలా చూడాలని సూచించారు. పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గవరపాలెం పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్, AHAలు ఈశ్వర్, సాగర్, వెంకట్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.