Sunday, 23 August 2026
  • Home  
  • భవ్య’ పథకం కింద విశాఖపట్నం – చెన్నై కారిడార్‌లో కెమికల్, పెట్రోకెమికల్ పార్కులు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
- విశాఖపట్నం

భవ్య’ పథకం కింద విశాఖపట్నం – చెన్నై కారిడార్‌లో కెమికల్, పెట్రోకెమికల్ పార్కులు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భవ్య’ పథకం కింద రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక పార్కులలో భాగంగా, విశాఖపట్నం – చెన్నై పి.సి.పి.ఐ.ఆర్ కారిడార్‌లో కెమికల్ మరియు పెట్రోకెమికల్ పార్కులను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేయాలని గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన దేశం నుంచి ప్రపంచానికి పెద్దఎత్తున బల్క్ డ్రగ్స్, ఔషధాలు సరఫరా చేస్తున్నప్పటికీ, ముడిసరుకు లభ్యత లేక అనేక ఫార్మా పరిశ్రమలు సిక్ యూనిట్లుగా మారుతున్నాయని, అధిక ధరలతో ముడిసరుకును దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని గుర్తు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటం, మెరుగైన పోర్టులు మరియు సీ-రూట్స్ ఉన్న విశాఖ – చెన్నై కారిడార్‌లో కెమికల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పరిశ్రమలకు ఎంతో ఊతం లభించడంతో పాటు డిమాండ్‌కు తగిన పెట్టుబడులు వస్తాయని వివరించారు. అలాగే ప్రతి పరిశ్రమ విడివిడిగా కాలుష్య శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడం భారమైనందున ప్రభుత్వమే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, అవి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా పర్యవేక్షించాలని కోరారు. వీటితో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు టెస్టింగ్ సెంటర్లు, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. పరిశ్రమల్లో అనుకోని అగ్నిప్రమాదాలు లేదా మరణాలు సంభవించినప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అపరిమిత పరిహారాల సమస్యలు రాకుండా, ఇరువర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వమే ముందస్తుగా ప్రామాణిక ప్రమాద బీమా మరియు స్పష్టమైన నష్టపరిహార విధానాన్ని అమలు చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భవ్య’ పథకం కింద రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక పార్కులలో భాగంగా, విశాఖపట్నం – చెన్నై పి.సి.పి.ఐ.ఆర్ కారిడార్‌లో కెమికల్ మరియు పెట్రోకెమికల్ పార్కులను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేయాలని గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన దేశం నుంచి ప్రపంచానికి పెద్దఎత్తున బల్క్ డ్రగ్స్, ఔషధాలు సరఫరా చేస్తున్నప్పటికీ, ముడిసరుకు లభ్యత లేక అనేక ఫార్మా పరిశ్రమలు సిక్ యూనిట్లుగా మారుతున్నాయని, అధిక ధరలతో ముడిసరుకును దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని గుర్తు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటం, మెరుగైన పోర్టులు మరియు సీ-రూట్స్ ఉన్న విశాఖ – చెన్నై కారిడార్‌లో కెమికల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పరిశ్రమలకు ఎంతో ఊతం లభించడంతో పాటు డిమాండ్‌కు తగిన పెట్టుబడులు వస్తాయని వివరించారు.
అలాగే ప్రతి పరిశ్రమ విడివిడిగా కాలుష్య శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడం భారమైనందున ప్రభుత్వమే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, అవి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా పర్యవేక్షించాలని కోరారు. వీటితో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు టెస్టింగ్ సెంటర్లు, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. పరిశ్రమల్లో అనుకోని అగ్నిప్రమాదాలు లేదా మరణాలు సంభవించినప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అపరిమిత పరిహారాల సమస్యలు రాకుండా, ఇరువర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వమే ముందస్తుగా ప్రామాణిక ప్రమాద బీమా మరియు స్పష్టమైన నష్టపరిహార విధానాన్ని అమలు చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.