ఆగస్ట్ 27( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
కాఠ్మండు: నేపాల్లో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటి వరకు 157 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 400 మందికి పైగా గల్లంతయ్యారని తెలుపుతున్నారు.
రాజధాని కాఠ్మండుతో సహా అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో నదులు ఉప్పొంగాయి. గ్రామాలు, పట్టణాల్లోని అనేక ఇళ్లు మునిగిపోయాయి. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
గల్లంతైన వారి కోసం శోధన ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా సైన్యం, పోలీసులు, ఇతర సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


