ఆర్లపడియ: మండలంలోని ఆర్లపడియ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి తోట శ్రీనివాసులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల అభ్యసన, పఠన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలు తరగతి స్థాయికి అనుగుణంగా ఉండటంపై ఉపాధ్యాయిని స్రవంతిని అభినందించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను త్వరితగతిన ఆన్లైన్లో నమోదు చేయాలని ఎంఈఓ ఆదేశించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ఆర్లపడియ పాఠశాలలో ఎంఈఓ తనిఖీ