విశాఖపట్నం: పద్మనాభం, పున్నమి( ప్రతినిధి ) ఆగస్టు 27::::నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మహీంద్రా సంస్థ సహకారంతో నిర్వహించిన ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా కేజీబీవీ పద్మనాభం విద్యార్థులు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని TU-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంను సందర్శించారు.
విద్యార్థులు విమానం నిర్మాణం, వివిధ భాగాలు, విమానం పనిచేసే విధానం, విమాన ప్రయాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికుల భద్రత కోసం పాటించాల్సిన ఎమర్జెన్సీ ప్రొసీజర్లను మ్యూజియం సిబ్బంది వివరించారు.
కేజీబీవీ పద్మనాభం ప్రిన్సిపాల్ శ్రీమతి గ్రేస్ లిల్లీ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పోజర్ విజిట్ విద్యార్థులకు పాఠ్యపుస్తక జ్ఞానానికి మించి ప్రత్యక్ష అనుభవాన్ని అందించిందన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు ఇలాంటి విజిట్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విమాన సాంకేతికతపై విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఇలాంటి విజ్ఞానదాయకమైన అవకాశాలను కల్పిస్తున్న నాంది ఫౌండేషన్, మహీంద్రా సంస్థలకు పాఠశాల తరఫున ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లీ కృతజ్ఞతలు తెలిపారు.






