నంద్యాల: జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ PG 2026 పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS తెలిపారు. AVR SVR, RGM, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు రామకృష్ణ PG కాలేజ్ కేంద్రాల్లో మొత్తం 770 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎస్పీ స్వయంగా కేంద్రాలను సందర్శించి భద్రతను పరిశీలించారు. ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఏఐ గ్లాసెస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కఠినంగా నిషేధించామని, కేంద్రాల వద్ద జామర్లు, సీసీ కెమెరాలు, డ్రోన్ పెట్రోలింగ్‌తో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

నీట్ PG పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ సునీల్ షొరాణ్