Friday, 4 September 2026
  • Home  
  • పోలీస్ ఆంక్షలతో వైకాపా పోరాటాన్ని ఆపలేరు వెలుగోడు రిజర్వాయర్ నిరసనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ధ్వజం
- నంద్యాల

పోలీస్ ఆంక్షలతో వైకాపా పోరాటాన్ని ఆపలేరు వెలుగోడు రిజర్వాయర్ నిరసనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ధ్వజం

నంద్యాల:రైతాంగ సమస్యలు, తాగు, సాగునీటి విడుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు కూటమి ప్రభుత్వం భయపడుతోందని నంద్యాల జిల్లా వైసపి అధ్యక్షులు, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు, వైకాపా శ్రేణులు తరలిరాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.పోలీస్ నోటీసులు, బెదిరింపులపై ఆగ్రహంకార్యక్రమానికి ట్రాక్టర్లు ఇవ్వకూడదని వైకాపా నాయకులు, రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనకు ట్రాక్టర్లతో వస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. రైతుల కోసం చేసే పోరాటాలను ఆంక్షలతో అణచివేయలేరని, జెండాలు, అజెండాలు పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రైతుల కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.