సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు.. ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 3 :::
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 30, 2026 వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు.
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల సందర్భంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.
విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, అవసరమైన ధ్రువపత్రాలు తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించార

