గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, ల్యాబ్ విభాగాలను పరిశీలించిన ఆమె, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ల్యాబ్‌లోని హిమోగ్లోబిన్ పరీక్షల వివరాలు తెలుసుకోవడంతో పాటు, వైద్య సేవల నమోదు ప్రక్రియను కలెక్టర్ సమీక్షించారు. ఆస్పత్రిలోని రోగులతో నేరుగా మాట్లాడి ఉచిత మందుల పంపిణీ, వైద్య సేవలపై ఆరా తీశారు. అందుతున్న వైద్య సేవల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, డాక్టర్ కే.సి. శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు

జిల్లెల పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్