గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పీహెచ్‌సీలో వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు ఆరోగ్య కేంద్రాన్ని తాత్కాలికంగా సచివాలయ భవనంలోకి మార్చాలని సూచించారు. అనంతరం సచివాలయంలో హాజరు, ఆధార్ సేవలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్.. ప్రజల అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు

దీబగుంట్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ