రాజంపేట:రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో క్యాడర్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట టౌన్, నందలూరు మరియు వీరబల్లి మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఆయన శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జీలు షేక్ కరీం, పోరుమామిళ్ల చలపతి, నందలూరు కో-క్లస్టర్ ఇన్‌ఛార్జ్ యానాది, సీనియర్ నాయకులు కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, నందకుమార్ రాజు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


