Tuesday, 29 September 2026

Tag: Health

నంద్యాల

రేబీస్‌పై అప్రమత్తతే రక్షణ

ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శారద బాయి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఎస్. అశ్రుఫ్ ఆలీ రేబీస్ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రేబీస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కుక్కలు, ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా ప్రభుత్వ వైద్యసంస్థను సంప్రదించి యాంటీ రేబీస్ టీకా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రసన్న లక్ష్మీ, డీపీఎంవో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

ఆయుర్వేద దినోత్సవం: కలెక్టరేట్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా పరీక్షలు చేయించుకుని మందులు పొందిన కలెక్టర్, ఆయుర్వేదం మన సంప్రదాయ విజ్ఞానంలో కీలకమైనదని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే నడుము నొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు ఆయుర్వేద వైద్యం ఎంతో మేలు చేస్తుందని, ప్రజలు అర్హులైన వైద్యుల సలహాతో ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లా ఆయుష్ అధికారి యశోద మాట్లాడుతూ సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. నాడీ, బిఎమ్‌డి, హెచ్‌బి పరీక్షలు నిర్వహించిన ఈ శిబిరంలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు

నంద్యాల

ఎయిడ్స్‌ నియంత్రణకు సమష్టిగా పోరాడుదాం: డాక్టర్‌ శారదాబాయి

నంద్యాల: ఎయిడ్స్‌ నియంత్రణకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం సమన్వయంతో పనిచేసి 95-95-95 లక్ష్యాలను సాధించాలని డాక్టర్ శారదాబాయి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఏఆర్‌టీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెచ్‌ఐవీ పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంచి, బాధితులకు ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా నిరంతరం మందులు అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.ముఖ్యంగా గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులు, అధిక ప్రమాదంలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌టీ వైద్యులు, సీపీఎం అలీ హైదర్, కౌన్సిలర్లు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నంద్యాల

కుష్టు సర్వేకు ప్రజలు సహకరించాలి: డీఎంహెచ్‌ఓ శారదా బాయి

నంద్యాల: జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డా. ఎం. శారదా బాయి తెలిపారు. 2027 మార్చి నాటికి కుష్టు రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి వ్యాధి లక్షణాలను గుర్తిస్తారని చెప్పారు.చర్మంపై స్పర్శలేని మచ్చలు, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (MDT) అందిస్తామని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

నంద్యాల

జిల్లెల పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, ల్యాబ్‌ విభాగాలను పరిశీలించిన ఆమె, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ల్యాబ్‌లోని హిమోగ్లోబిన్‌ పరీక్షల వివరాలు తెలుసుకోవడంతో పాటు, వైద్య సేవల నమోదు ప్రక్రియను కలెక్టర్ సమీక్షించారు. ఆస్పత్రిలోని రోగులతో నేరుగా మాట్లాడి ఉచిత మందుల పంపిణీ, వైద్య సేవలపై ఆరా తీశారు. అందుతున్న వైద్య సేవల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కే.సి. శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల

దీబగుంట్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పీహెచ్‌సీలో వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు ఆరోగ్య కేంద్రాన్ని తాత్కాలికంగా సచివాలయ భవనంలోకి మార్చాలని సూచించారు. అనంతరం సచివాలయంలో హాజరు, ఆధార్ సేవలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్.. ప్రజల అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల

యశోద ఆసుపత్రిలో ప్రత్యేక ‘ఈసీఎంఓ’ కేంద్రం ప్రారంభం

నంద్యాల:హైదరాబాద్‌లోని ప్రముఖ యశోద ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్లో భాగంగా ప్రత్యేక ఈసీఎంఓ (ECMO) కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తీవ్ర అనారోగ్యంతో గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్షీణించిన రోగులకు ఈసీఎంఓ చికిత్స ప్రాణదానంగా నిలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటలూ నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది పర్యవేక్షణలో ఈ సేవలు అందుతాయని వివరించారు. గుండెపోటు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, అవయవ మార్పిడి మరియు అత్యవసర చికిత్స విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఈ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ సుమంత్ రెడ్డి, మార్కెటింగ్ ప్రతినిధి బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

యశోద హాస్పిటల్స్‌కు అంతర్జాతీయ ‘ప్లాటినం’ గుర్తింపు

నంద్యాల :హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని సాధించింది. అంతర్జాతీయ ‘ఎక్స్‌ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ (ELSO) నుంచి ప్రతిష్ఠాత్మక ‘ప్లాటినం సర్టిఫికేషన్’ సాధించి, దేశంలోనే అత్యుత్తమ ఎక్మో (ECMO) కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నిశాంత్ తెలిపారు.చనిపోయే స్థితిలో ఉన్న గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు అధునాతన ఎక్మో మరియు అవయవ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) సేవల ద్వారా పునర్జన్మ ప్రసాదిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్య విశేషాలు:అత్యుత్తమ సేవలు: VA, VV, ECPR వంటి ఆధునిక ఎక్మో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ అంబులెన్స్: అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం ఉంది. నంద్యాలలో అందుబాటు: హైదరాబాద్‌ రా లేని రోగుల కోసం నంద్యాలలోని శాంతిరామ్, క్రిటికల్ కేర్ ఆసుపత్రుల ద్వారా ప్రాథమిక సేవలు అందిస్తున్నారు.సంప్రదించాల్సిన నంబర్: వైద్య సేవల సమాచారం కోసం 9247906103 ను సంప్రదించవచ్చు. ఈ సమావేశంలో ఆసుపత్రి ప్రతినిధులు బాబయ్య, సుమంత్ పాల్గొన్నారు.

నంద్యాల

సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో అత్యాధునిక అంబులెన్స్ ప్రారంభం

నంద్యాల : పద్మావతి నగర్‌లోని సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో మూడు రోజులుగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. శిబిరంలో సుమారు 200 మంది శిశువులు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్‌ను ఉచితంగా చేశారు.ఈ సందర్భంగా నవజాత శిశువులు, చిన్నారుల అత్యవసర చికిత్స కోసం రూపొందించిన అత్యాధునిక అంబులెన్స్‌ను డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. అంబులెన్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ వెంటిలేటర్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

సూర్యన్ ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మావతి నగర్‌లోని సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో మూడు రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు శిబిరాన్ని ప్రారంభించారు.డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ ఆధ్వర్యంలో నవజాత శిశువులకు వినికిడి పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశువుకు రూ.2,500 విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం వరకు జరిగే శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.