Wednesday, 2 September 2026
  • Home  
  • చిట్వేలిలో ఘనంగా పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు
- తిరుపతి

చిట్వేలిలో ఘనంగా పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు చిట్వేలిలో ఘనంగా నిర్వహించారు. జనసేన యువనాయకులు ఆనాల సునీల్‌కుమార్‌, పగడాల శివకుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్లెక్సీలు, జెండాలతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. జనసేన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన యనమల భాస్కర్‌కు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. యనమల భాస్కర్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ నిజాయితీకి ప్రతీకగా, పేదల పక్షపాతిగా ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కోడూరు నియోజకవర్గంలో జనసేనకు బలమైన కార్యకర్తలు, అభిమానులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పంతగాని నరసింహ ప్రసాద్‌, మాచినేని విశ్వేశ్వర్‌నాయుడు, కాకర్ల నాగార్జున, రామాంజుల నాయుడు, లారీ సుబ్బరాయుడు, మాదినేని కనకరాజు, పగడాల శివ, దండు రమేష్‌, సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.