Wednesday, 2 September 2026
  • Home  
  • ఉత్తరాంధ్రలో బీళ్లన్నీ ఇక పంటలే
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉత్తరాంధ్రలో బీళ్లన్నీ ఇక పంటలే

సెప్టెంబర్ 2, 2026 గోదావరి జలాల రాకతో ఉత్తరాంధ్రలోని బీడు భూములన్నీ ఇకపై పచ్చని పంటలతో విలసిల్లుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాకు చేరుకున్న గోదారమ్మకు ప్రణమిల్లుతూ.. రాబోయే రోజుల్లో గోదావరి జలాలను సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి సాక్షిగా వంశధార వరకు తరలిస్తామని ప్రకటించారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ నదులపై అక్విడెక్టులు, సైఫన్లు నిర్మించి గోదావరిని అనుసంధానించామని, ఇప్పటివరకు ఎడమ కాలువపై రూ.4,192 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.800 కోట్లతో పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఈ ఘనత వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సీఎం కొనియాడారు.

సెప్టెంబర్ 2, 2026
గోదావరి జలాల రాకతో ఉత్తరాంధ్రలోని బీడు భూములన్నీ ఇకపై పచ్చని పంటలతో విలసిల్లుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాకు చేరుకున్న గోదారమ్మకు ప్రణమిల్లుతూ.. రాబోయే రోజుల్లో గోదావరి జలాలను సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి సాక్షిగా వంశధార వరకు తరలిస్తామని ప్రకటించారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ నదులపై అక్విడెక్టులు, సైఫన్లు నిర్మించి గోదావరిని అనుసంధానించామని, ఇప్పటివరకు ఎడమ కాలువపై రూ.4,192 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.800 కోట్లతో పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఈ ఘనత వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సీఎం కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.