Thursday, 3 September 2026
  • Home  
  • ఘనంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం క్రీడాకారులను సన్మానించిన హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు
- నంద్యాల

ఘనంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం క్రీడాకారులను సన్మానించిన హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు

నంద్యాల: స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్.ఎస్.పి. దివాకర్, పాఠశాల హెచ్‌ఎం నళిని ముఖ్యఅతిథులుగా హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయి హాకీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులు మిద్దె శిశిర గ్రేస్, జెరూషా క్రిష్టియా, భార్గవిలతో పాటు వెటరన్ క్రీడాకారుడు శిరవెళ్ల విల్సన్‌ను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఫోటో క్యాప్షన్: మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, హెచ్‌ఎం నళిని, క్రీడాకారులు.

నంద్యాల: స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్.ఎస్.పి. దివాకర్, పాఠశాల హెచ్‌ఎం నళిని ముఖ్యఅతిథులుగా హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయి హాకీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులు మిద్దె శిశిర గ్రేస్, జెరూషా క్రిష్టియా, భార్గవిలతో పాటు వెటరన్ క్రీడాకారుడు శిరవెళ్ల విల్సన్‌ను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఫోటో క్యాప్షన్: మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, హెచ్‌ఎం నళిని, క్రీడాకారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.