Friday, 29 May 2026
  • Home  
  • *రామవరప్పాడు అబ్దుల్ కలాం నగర్‌లో పి4 పథకం లో భాగంగా రూ. కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన*
- ఆంధ్రప్రదేశ్

*రామవరప్పాడు అబ్దుల్ కలాం నగర్‌లో పి4 పథకం లో భాగంగా రూ. కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన*

పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం *గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోనే తొలి ఏఐ (AI) శిక్షణ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే యార్లగడ్డ* *హెచ్‌సీఎల్ (HCL) సంస్థ సహకారంతో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ* *లక్షల రూపాయల జీతాలతో కూడిన ఉద్యోగాలు పొందేలా యువతకు శిక్షణ* *రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో కొత్త పీహెచ్‌సీ (PHC) కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా : యార్లగడ్డ* రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గం గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పబ్లిక్ – ప్రైవేట్ – పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (P4) కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, ఎస్‌ఎల్‌వీ గ్రూప్ చైర్మన్ పెనుమాత్స శ్రీనివాసరాజు లతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎస్ఎల్వీ చైర్మన్ రాజు కి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత నిధులు కోటి రూపాయలతో పి-ఫోర్ లో భాగంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. గన్నవరం నియోజకవర్గ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హెచ్‌సిఎల్ సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఏఐ శిక్షణ కేంద్రాన్ని కేసరపల్లి లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెక్నికల్, నాన్-టెక్నికల్ యువతకు ఈ శిక్షణ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు పొందే స్థాయికి యువతను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, భవిష్యత్తులో ప్రతి నెలా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత ఆదాయం పెరిగితేనే నియోజకవర్గం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములపై అన్యాక్రాంతం చేశారని మండిపడ్డారు. విజయవాడ రూరల్ మండలంలో 39 ఎకరాలు, బాపులపాడు మండలంలో 60 ఎకరాలకు పైగా ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య రంగ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, సిహెచ్‌సి కేంద్రానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.4 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని తెలిపారు. అదనంగా మరో రూ.5 కోట్లతో ప్రత్యేక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు వంటి ప్రాంతాల్లో జనాభా ఆధారంగా కొత్త పిహెచ్‌సి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామవరప్పాడు గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.14.32 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గత పాలకులు గ్రామ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది రూ.1,500 నుంచి 1,600 కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గన్నవరాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ & నియోజకవర్గ పి4 కోఆర్డినేటర్ రాజేష్, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, రామవరప్పాడు గ్రామ టిడిపి అధ్యక్షులు నబిగాని కొండయ్య, క్లస్టర్ ఇంచార్జి కొల్లా ఆనంద్, మాజీ సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు, మున్నంగి సత్యనారాయణ, బెజ్జవరపు సూర్యకుమారి, మేకల స్వాతి, అడ్డగిరి రామకృష్ణ, కోట మురళి, గుడివాక బాబు, కొంగన రవి, ఇజ్జు రాము, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం

*గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోనే తొలి ఏఐ (AI) శిక్షణ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే యార్లగడ్డ*

*హెచ్‌సీఎల్ (HCL) సంస్థ సహకారంతో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ*

*లక్షల రూపాయల జీతాలతో కూడిన ఉద్యోగాలు పొందేలా యువతకు శిక్షణ*

*రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో కొత్త పీహెచ్‌సీ (PHC) కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా : యార్లగడ్డ*

రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గం గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పబ్లిక్ – ప్రైవేట్ – పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (P4) కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, ఎస్‌ఎల్‌వీ గ్రూప్ చైర్మన్ పెనుమాత్స శ్రీనివాసరాజు లతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎస్ఎల్వీ చైర్మన్ రాజు కి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత నిధులు కోటి రూపాయలతో పి-ఫోర్ లో భాగంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. గన్నవరం నియోజకవర్గ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హెచ్‌సిఎల్ సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఏఐ శిక్షణ కేంద్రాన్ని కేసరపల్లి లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెక్నికల్, నాన్-టెక్నికల్ యువతకు ఈ శిక్షణ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు పొందే స్థాయికి యువతను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, భవిష్యత్తులో ప్రతి నెలా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత ఆదాయం పెరిగితేనే నియోజకవర్గం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములపై అన్యాక్రాంతం చేశారని మండిపడ్డారు. విజయవాడ రూరల్ మండలంలో 39 ఎకరాలు, బాపులపాడు మండలంలో 60 ఎకరాలకు పైగా ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య రంగ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, సిహెచ్‌సి కేంద్రానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.4 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని తెలిపారు. అదనంగా మరో రూ.5 కోట్లతో ప్రత్యేక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు వంటి ప్రాంతాల్లో జనాభా ఆధారంగా కొత్త పిహెచ్‌సి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామవరప్పాడు గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.14.32 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గత పాలకులు గ్రామ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది రూ.1,500 నుంచి 1,600 కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గన్నవరాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ & నియోజకవర్గ పి4 కోఆర్డినేటర్ రాజేష్, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, రామవరప్పాడు గ్రామ టిడిపి అధ్యక్షులు నబిగాని కొండయ్య, క్లస్టర్ ఇంచార్జి కొల్లా ఆనంద్, మాజీ సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు, మున్నంగి సత్యనారాయణ, బెజ్జవరపు సూర్యకుమారి, మేకల స్వాతి, అడ్డగిరి రామకృష్ణ, కోట మురళి, గుడివాక బాబు, కొంగన రవి, ఇజ్జు రాము, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.