Thursday, 3 September 2026
  • Home  
  • ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
- ఎన్ టి ఆర్ జిల్లా

ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో మెరుగైన వైద్య సేవలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. దాములూరులో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం. రూ.36 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంటే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు, పోషకాహార పర్యవేక్షణ వంటి సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, పరీక్షల సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ఆరోగ్య కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. దాములూరులో నూతన ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి గ్రామస్తులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో మెరుగైన వైద్య సేవలు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

దాములూరులో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం.

రూ.36 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3:

గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంటే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు, పోషకాహార పర్యవేక్షణ వంటి సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, పరీక్షల సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ఆరోగ్య కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.

దాములూరులో నూతన ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి గ్రామస్తులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.