నంద్యాల : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, తాగునీరు, పారిశుధ్యం, ఫైర్ సేఫ్టీ, ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, అంబులెన్సులు తదితర సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో రహదారుల మరమ్మతులు పూర్తి చేసి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రూట్ మ్యాప్, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వినాయక చవితి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి