Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

ప్రజావాణి ఫిర్యాదు తో రైతు కుటుంబానికి న్యాయం

ప్రజావాణి ఫిర్యాదుతో రైతు కుటుంబానికి న్యాయం ———————————————————— జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి : భూ భారతి నమోదు ద్వారా వ్యవసాయ భూమికి దారి కల్పింపు జిల్లా కలెక్టర్ జోక్యంతో ఐదేళ్ల దారి సమస్యకు పరిష్కారం- జనగామ మండలం శామీరపేట గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న వ్యవసాయ భూమి దారి సమస్యకు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జోక్యంతో పరిష్కారం లభించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై అధికారులు వేగంగా స్పందించి, భూ రికార్డులను పరిశీలించి, చట్టబద్ధంగా దారిని పునరుద్ధరించడంతో బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. జనగామ మండలం, శామీర్పేట గ్రామంలోని సర్వే నంబర్ 21/A/2/ఆ పరిధిలో ఉన్న తమ వ్యవసాయ భూమికి సుమారు 60 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న దారిని పక్క భూమి యజమానులు ఉద్దేశపూర్వకంగా మూసివేశారని బాధితురాలు తాళ్ల దివ్య (భర్త: నర్సిరెడ్డి) తెలిపారు. దారికి అడ్డంగా కంప వేసి రాకపోకలను అడ్డుకోవడంతో గత ఐదేళ్లుగా వ్యవసాయ పనులు నిర్వహించడం, పంటలను తరలించడం, భూమికి వెళ్లి రావడం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సమస్య కారణంగా తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎక్కడా న్యాయం జరగకపోవడంతో చివరకు ప్రజావాణి ద్వారా *జిల్లా కలెక్టర్‌కు* ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును *జిల్లా కలెక్టర్* తీవ్రంగా పరిగణించి, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను వెంటనే చర్యలకు ఆదేశించారు. అధికారులు భూమి రికార్డులు, పాత పహానీలు, సర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఐదు గుంటల భూమిని భూ భారతి పహానీలో నమోదు చేసి, వ్యవసాయ భూమికి దారి కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికినట్లైంది. అలాగే తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి న్యాయం చేసిన పోలీసు శాఖకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎంఆర్ఓ, సర్వే ఏడీ, డీఐ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులకు తాళ్ల దివ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రజావాణిలో తమ వినతిని స్వీకరించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించి న్యాయం చేసిన *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కు కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే జిల్లా పరిపాలన సంకల్పానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.

జనగాం

జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కు అభినందనలు తెలిపిన విద్యుత్ అధికారులు

ఐపీఎస్‌ క్యాడర్‌కు పదోన్నతి పొందిన జనగామ డీసీపీ రాజా మహేంద్రనాయక్‌ ను ఘనంగా సన్మానించిన విద్యుత్ అధికారులు ———————————————————————- జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ డీసీపీ రాజా మహేంద్రనాయక్ ఐపీఎస్‌ క్యాడర్‌కు పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్ఈ/ఎలక్ట్రికల్ సిహెచ్ . సంపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్‌ సేవా ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎం. లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడీఈ డి. వేణుగోపాల్, ఏఈ బి. సౌమ్యతో పాటు విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొని డీసీపీ కు శుభాకాంక్షలు తెలిపారు

జనగాం

బిసి విద్యార్థుల స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి :Trp

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి:, పిట్టల సురేష్ టి ఆర్ పి జిల్లా యూత్ అధ్యక్షులు,విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ ——————————————————————– బీసీలపై ఎందుకు ఇంత కక్ష? విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్ *బీసీ విద్యార్థుల అన్యాయంపై టీఆర్పీ పార్టీ నల్ల బ్యాడ్జీల నిరసన* బీసీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు MlC తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్ చేశారు. జనగామ చౌరస్తాలో బీసీ విద్యార్థుల అన్యాయంపై నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి తమ చదువులను కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వారి విద్యా భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడంతో కళాశాల ఫీజులు చెల్లించలేక, విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య ఒక హక్కు అని, ఆ హక్కును ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూరం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, బీసీల సంక్షేమం గురించి ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఆచరణలో మాత్రం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదని, ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బీసీ స్కాలర్‌షిప్‌ల వివరాలను వెల్లడించి, అర్హులైన ప్రతి విద్యార్థి ఖాతాకు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తేలికగా తీసుకుంటే *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* చూస్తూ ఊరుకోదని, విద్యార్థుల తరఫున మరింత బలమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ నాయకులు బాలశివుడు, విద్యార్థులు చందు, అశోక్, సంగీత, రాధిక, విజయ, ప్రణీత, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి:TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్

సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం జిల్లా వ్యాప్త నిరసనలు:Tptf రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీనివాస్ —————————————————————- ఉద్యోగ ఉపాధ్యాయ మిగతా కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ TGEJAC పిలుపు మేరకు సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు , కార్యాలయాలు ముందర ఉద్యోగ, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ గానుగు పహాడ్ ఉన్నత పాఠశాల నుండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధాన్ని పునరుద్దలించాలనీ , పెండింగ్ లో ఉన్న ఆరు డి ఎ లను వెంటనే విడుదల చేయాలని, మూడు సంవత్సరాలుగా సాగతీస్తున్న పిఆర్సి ని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ పెన్షనర్లకు ఎలాంటి చెల్లింపులు సమగ్ర హెల్త్ కార్డు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డి.శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

జనగాం

జనగామ కలెక్టరేట్ ఎదుట TGEJAC ఆధ్వర్యలో నిరసన

*పెన్షన్ విద్రోహ విధానాలను ఉపసంహరించాలి – పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి:Tsutf —————————————————————– *జనగామ కలెక్టరేట్ ఎదుట TGEJAC ఆధ్వర్యంలో నిరసన* జనగామ, సెప్టెంబర్ 1: ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రతను దెబ్బతీసే పెన్షన్ విధానాలను వ్యతిరేకిస్తూ, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TGEJAC కో-చైర్మెన్ చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే వరం కాదని, సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన హక్కు అని పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్లు: 🔹 పాత పెన్షన్ విధానం (OPS)ను తక్షణమే పునరుద్ధరించాలి. 🔹 CPS/UPS విధానాలను ఉపసంహరించి ఉద్యోగులకు పూర్తి పెన్షన్ భద్రత కల్పించాలి. 🔹 ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడిపేలా పెన్షన్ హక్కును కాపాడాలి. 🔹 పెన్షన్ నిధులపై ఉద్యోగులకు నష్టదాయకమైన విధానాలను రద్దు చేయాలి. 🔹 ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. 🔹 పెన్షన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయాలి.అని డిమాండ్ చేశారు TGEJAC సెక్రటరీ కొర్నేలియస్ మాట్లాడుతూ పెన్షన్ సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, TNGO ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , లక్ష్మణ మూర్తి ,మాడూరి వెంకటేష్ ,రామస్వామి ,రాజయ్య ,మనోజ్ ,కృష్ణమూర్తి ,రాం నర్సయ్య ,జ్యోతి , ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “పెన్షన్ మా హక్కు – భిక్ష కాదు!” “పాత పెన్షన్ విధానం – ఉద్యోగుల సామాజిక భద్రతకు రక్షణ!”అని నినాదాలు ఇచ్చారు

జనగాం

బాలాజి నగర్ లో డి శ్రీ రేణుక ఎల్లమ్మ కు పుష్పాలతో అలంకరణ

*బాలాజీ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మకు పుష్పాలతో అలంకరణ* ——————————————————————- జనగామ, సెప్టెంబర్ 1,పున్నమి ప్రతినిధి : శ్రావణమాసం మూడవ మంగళవారం సందర్భంగా జనగామ పట్టణంలోని 3వ వార్డు బాలాజీనగర్‌లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి వివిధ రకాల సువాసనభరితమైన పుష్పాలతో విశేష పుష్పాలంకరణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం పోసి బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజారి మారుపాక శ్యాం ప్రసాద్ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.పుష్పాలు పవిత్రతకు, సౌందర్యానికి, భక్తికి ప్రతీకలుగా భావిస్తారని, అమ్మవారికి పుష్పాలతో అలంకరణ చేయడం ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని దైవత్వంతో అనుసంధానం చేస్తూ భక్తులు తమ భక్తిశ్రద్ధలను చాటుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పుష్పాల సుగంధం, రంగులు ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా మార్చి భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారికి పుష్పాలతో అలంకరణ చేయడం వల్ల సర్వశుభాలు కలగాలని, కుటుంబాల్లో సుఖశాంతులు,ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, పట్టణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11:30 లకు దివ్య కుంకుమ పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, కుంకుమ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో దూడల శోభారాణి, లగిశెట్టి పద్మావతి, మారుపాక విజయ, గోరిగె సత్తెమ్మ,యెనగందుల రేణుక, చెరుకూరి మౌనిక, బండోజు సరళ, అయిత కళావతి, కల్పన, పొత్కనూరి మౌనిక , చెంచారపు మంజుల, బైరగోని సుజాత, పావని, చింతలక్ష్మి, భోగ రజిత,తార, ఉమా, విజయ,నిర్వాహకులు దూడల రమేష్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలి:శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ

4వ తేదీన జరగబోయే శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలని యాదవ కుల పెద్దలకు, కుల బాంధవులకు శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ ఆహ్వానం* *శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ* ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఓం సాయి గార్డెన్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ✓ఈ కార్యక్రమం శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ అధ్యక్షులు *కానుగంటి ముత్తయ్య యాదవ్* అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ✓ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్* మరియు యాదవ సంఘం ముఖ్య నేతలు , నాయకులు పాల్గొన్నారు. ✓ఈ సందర్భంగా ముత్తయ్య యాదవ్ మాట్లాడుతూ 4వ తేదీన జరగబోయే శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమం స్థానిక నెహ్రూ పార్క్ నుండి బతుకమ్మ కుంట వరకు భారీ ఎత్తున యాదవ కులబంధవులు హాజరై వేడుకలు విజయవంతం చేయాలని మనవి చేశారు. అదేవిధంగా కార్యక్రమం యొక్క ముఖ్య సందేశం ఇచ్చారు. ✓ఈ సందర్భంగా శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కనివిని ఎరుగని విధంగా ఈసారి పెద్ద ఎత్తున విజయం విజయవంతం చేయుటకు యావత్ యాదవ సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వైటీడీఏ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ మరియు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు యాదవ సంఘం రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ✓ఈ వేడుకలకు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్న యాదవ కుల బంధువులు హిందూ భక్తులు అందరూ భారీ సంఖ్యలో వచ్చి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ✓అనంతరం వాల్ పోస్టర్ విడుదల చేసిన శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ నాయకులు. ✓ఈ సందర్భంగా ముఖ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ… జనగామ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని, ప్రతి యాదవ బంధువు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ✓ఈ కార్యక్రమంలో *శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ*ప్రధాని కార్యదర్శు తోటకూరి పాండు కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు హరి ప్రసాద్ యాదవ్,s శివరాజ్ యాదవ్, వారాల రమేష్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు బొంగు ఐలయ్య యాదవ్, చిలువేరు కృష్ణమూర్తి యాదవ్ ,పురమని రజాక్ యాదవ్ ,జక్కుల వేణుమాధవ్ ,మేకల కళింగ రాజు యాదవ్, సర్పంచ్ లు బొల్లా సంపత్, కూకట్ల యాదగిరి, నాయకులు సింగరి ప్రశాంత్, చంద్రయ్య, శ్రీరాములు ,మధుసూదన్ యాదవ్, కావటి భాస్కర్, ముత్యాలు, మల్లయ్య,యాదగిరి, కుమార్ ,చిన్న, బాలరాజు, నందు యాదవ్,గంగా రాజు,ప్రభాకర్,రాజు,మౌనిస్,తిరుపతి,బాలస్వామి, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల యాదవ సంఘాల నాయకులు,వివిధ గ్రామాల యాదవ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి ల తో నిరసన :బిజెపి జిల్లా అధ్యక్షులు జనగామ

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భాజపా రాష్ట్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుని వర్షిత్ రెడ్డి ఇంటి పై దాడి చేసే ప్రయత్నం చేయడం భాజపా తీవ్రంగా ఖండిస్తుందని ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదని ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయాలని ప్రయత్నిస్తే బిజెపి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని బిజెపి ఒక్క కార్యకర్త 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు సమాధానం చెప్పగలరని కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి శాంతియుతంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామని. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంకొకసారి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని తగిన సమాధానం చెప్పడానికి భాజపా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని అదేవిధంగా పోలీసులు భాజపా రాష్ట్ర అధ్యక్షుని అక్రమంగా నిర్బంధించడం హౌస్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పోలీసు వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భాజాపాను అణిచివేయలేరని భాజపా కార్యకర్తలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగల రమేష్ సీనియర్ నాయకులు మహంకాళి హరిచంద్ర గుప్తా యువ మోర్చా రాష్ట్ర నాయకులు చింతకింది సంతోష్ జిల్లా అధ్యక్షులు ఎల్లబోయినా హరీష్ జనగామ రూరల్ మండలం అధ్యక్షులు మహిపాల్ గానుగుపాడు సర్పంచ్ అనూష మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాంబ జీవనజ్యోతి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద జగదీష్ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు అశోక్ ఏ కళ్యాణి జనార్ధన్ సందీప్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

జనగాం

GCDO గౌసియా బేగం పై చర్యలు తీసుకోవాలి :పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జిల్లా అధ్యక్షులు

గురుకులాల్లో NSPC నమోదుకు టార్గెట్లు పెట్టడం సరికాదు:పిట్టల సురేష్ టి ఆర్ పి యూత్ జనగామ జిల్లా అధ్యక్షులు ———————————————————————- GCDO గౌసియా బేగంపై చర్యలు తీసుకోవాలని టీఆర్పీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్న National Student Paryavaran Competition (NSPC) నమోదుకు ఉపాధ్యాయులకు రోజువారీ టార్గెట్లు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా NSPC నమోదులో నెంబర్ వన్‌గా రావాలనే ఉద్దేశంతో GCDO గౌసియా బేగం ఉపాధ్యాయులకు టార్గెట్లు విధిస్తున్నారని తమకు సమాచారం అందిందని, ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని పిట్టల సురేష్ అన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు పాఠాలు బోధించడం, వారి విద్యా ప్రగతిపై దృష్టి పెట్టడం అని, విద్యార్థుల ద్వారా జరగాల్సిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఉపాధ్యాయులపై టార్గెట్ల రూపంలో మోపడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రోజువారీ టార్గెట్ల ఒత్తిడి కారణంగా నమోదులో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, తప్పుడు పేర్లతో లేదా సరైన వివరాలు లేకుండా అప్లికేషన్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని” పిట్టల సురేష్ అన్నారు. ఈ వ్యవహారంపై GCDO గౌసియా బేగంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై MPDO గారికి ఈరోజు వినతి పత్రం అందజేసి, గురుకులాల్లో NSPC నమోదుకు విధిస్తున్న టార్గెట్లు, నమోదుల నాణ్యత, ఉపాధ్యాయులపై పడుతున్న పనిభారం తదితర అంశాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పిట్టల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, జిల్లా కార్యదర్శి వరకుప్పల గంగరాజు, యూత్ సంయుక్త కార్యదర్శి సాయి,యూత్ నాయకులు సాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ డి సి పి రాజా మహేంద్ర నాయక్ ఐపీస్ హోదా సందర్బంగా ఘనంగా సన్మానం

జనగామ డీసీపీ రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా: ఘనంగా సత్కరించిన నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక ——————————————————————- జనగామ, ఆగస్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెస్ట్‌జోన్‌ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్‌ హోదా లభించడం పట్ల స్థానిక సామాజిక, కళా, సాహిత్య సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం డీసీపీ కార్యాలయంలో ఆయనను నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావు, కవులు కళాకారుల ఐక్యవేదిక చైర్మన్ జి.కృష్ణ కలిసి డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఐపీఎస్‌ హోదా‌ లభించడం‌ జనగామ ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు.శాఖపరంగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలతో పాటు, ఇక్కడి కళా, సాహిత్య రంగాలకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నారగోని‌ మూర్తి, టి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.