4వ తేదీన జరగబోయే శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలని యాదవ కుల పెద్దలకు, కుల బాంధవులకు శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ ఆహ్వానం*
*శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ* ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఓం సాయి గార్డెన్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
✓ఈ కార్యక్రమం శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ అధ్యక్షులు *కానుగంటి ముత్తయ్య యాదవ్* అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
✓ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్* మరియు యాదవ సంఘం ముఖ్య నేతలు , నాయకులు పాల్గొన్నారు.
✓ఈ సందర్భంగా ముత్తయ్య యాదవ్ మాట్లాడుతూ 4వ తేదీన జరగబోయే శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమం స్థానిక నెహ్రూ పార్క్ నుండి బతుకమ్మ కుంట వరకు భారీ ఎత్తున యాదవ కులబంధవులు హాజరై వేడుకలు విజయవంతం చేయాలని మనవి చేశారు. అదేవిధంగా కార్యక్రమం యొక్క ముఖ్య సందేశం ఇచ్చారు.
✓ఈ సందర్భంగా శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కనివిని ఎరుగని విధంగా ఈసారి పెద్ద ఎత్తున విజయం విజయవంతం చేయుటకు యావత్ యాదవ సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వైటీడీఏ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ మరియు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు యాదవ సంఘం రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు.
✓ఈ వేడుకలకు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్న యాదవ కుల బంధువులు హిందూ భక్తులు అందరూ భారీ సంఖ్యలో వచ్చి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.
✓అనంతరం వాల్ పోస్టర్ విడుదల చేసిన శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ నాయకులు.
✓ఈ సందర్భంగా ముఖ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ… జనగామ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని, ప్రతి యాదవ బంధువు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
✓ఈ కార్యక్రమంలో *శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ*ప్రధాని కార్యదర్శు తోటకూరి పాండు కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు హరి ప్రసాద్ యాదవ్,s శివరాజ్ యాదవ్, వారాల రమేష్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు బొంగు ఐలయ్య యాదవ్, చిలువేరు కృష్ణమూర్తి యాదవ్ ,పురమని రజాక్ యాదవ్ ,జక్కుల వేణుమాధవ్ ,మేకల కళింగ రాజు యాదవ్, సర్పంచ్ లు బొల్లా సంపత్, కూకట్ల యాదగిరి, నాయకులు సింగరి ప్రశాంత్, చంద్రయ్య, శ్రీరాములు ,మధుసూదన్ యాదవ్, కావటి భాస్కర్, ముత్యాలు, మల్లయ్య,యాదగిరి, కుమార్ ,చిన్న, బాలరాజు, నందు యాదవ్,గంగా రాజు,ప్రభాకర్,రాజు,మౌనిస్,తిరుపతి,బాలస్వామి, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల యాదవ సంఘాల నాయకులు,వివిధ గ్రామాల యాదవ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



