Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

తీన్మార్ మల్లన్న మహా పాద యాత్ర ను విజవంతం చేయాలి :టి ఆర్ పి రాష్ట్ర, జిల్లా నాయకులు

తెలంగాణ రాజ్యాధికారం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మహా పాదయాత్ర ను విజవంతం చేయాలి : టి ఆర్ పి రాష్ట్ర, జిల్లా నాయకులు ——————————————————————- జనగామ, సెప్టెంబర్ 16,పున్నమి జిల్లా ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేపు ఉదయం ఏడు గంటలకు గోల్కొండ కోట నుండి ప్రారంభించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని జనగామ జిల్లా టిఆర్పి పార్టీ కుటుంబ సభ్యులను పార్టీ కార్యకర్తలను రాష్ట్ర నాయకులు విద్యార్థి విభాగాలు నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా విభాగం నాయకురాలు హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశించిన జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ కోరారు.జనగామ నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కర్నల్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మౌనిక యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ని స్థాపించిన రోజు 17 సెప్టెంబర్ ఒక చారిత్రకమైన చరిత లో నిలిచిపోతుంది. ఇదే రోజున పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మహాపాద యాత్ర చేపట్టిన దినం కూడా చరిత్ర లో లిఖించ బడుతుందని తెలిపారు.విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యార్థులతో జెన్ జీ ముఖాముఖీ సమావేశాలు ఏర్పాటు,పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ను కాపాడడానికి,బడుగు బలహీన వర్గాల విద్యార్థుల స్కాలషిప్ తక్షణమే విడుదల కొరకు శాసన మండలి లో ప్రశ్నించడం, ప్రభుత్వంను నిలదీసిన మహా నాయకులు మన తీన్మార్ మల్లన్న,ఈ మహా పాద యాత్రలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం కృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల మురళి బైండ్ల,జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇల్లందుల రవి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వెంపటి అజయ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు,జిల్లా కార్యదర్శి మంద దిలిప్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఉచితవితరణ వినాయక విగ్రహాల పంపిణి :గంగిశెట్టిప్రమోద్ కుమార్

*ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ గ్రేటర్ జనగామ మరియు లక్ష్మీ గణపతి అన్న ప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం 6:30 కు ఉచిత విత్తన మట్టి వినాయక విగ్రహాల (1500) పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ హాజరైనారు, వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గత 15 సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపడుతున్నామని అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే మీ ఇంట్లో మేము ఇచ్చిన విత్తన మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు పూజలు జరిపించుకొని మీ పెరట్లో నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి పలము గానీ పుష్పం గానీ వస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రాయోజకులుగా పెద్ది శ్రీనివాస్, బెల్దే శ్రీధర్, రామిని శ్రీనివాస్ అదే విధంగా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బిజిగం బిక్షపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య గౌరవ అధ్యక్షులు పజ్జూరి గోపయ్య రీజియన్ చైర్మన్ పడకంటి రవీందర్, గట్టు రాధా కృష్ణ, బుస్సా లింగమూర్తి, బెల్దే రాములు తదితరులు పాల్గొన్నారు*

జనగాం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాల లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కు డ్రా నిర్వహణ

ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని ఘనపూర్ (స్టేషన్), లింగాల ఘనపురం, జఫర్గడ్ మండలాల పరిధిలో గల 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డ్రా నిర్వహణ *అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు* జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని ఘనపూర్ (స్టేషన్), లింగాల ఘనపురం, జఫర్గడ్ మండలాల పరిధిలో గల 108 డబుల్ బెడ్‌ రూమ్ (2BHK) గృహాలను అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన డ్రా పద్ధతి ద్వారా పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక కోసం మూడు వనరుల నుంచి అర్హుల జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితా, ప్రజావాణి దరఖాస్తుదారులు, ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అందజేసిన పేర్లు – ఈ మూడు జాబితాల్లోని ప్రతి అర్హ కుటుంబాన్ని ఏకీకృత జాబితాలో చేర్చినట్లు చెప్పారు. డ్రా మొత్తం వీడియో చిత్రీకరణతో, జిల్లా స్థాయి కమిటీ సమక్షంలో ఇన్-కెమెరా విధానంలో చేపట్టడం జరిగిందన్నారు. డ్రా పూర్తిగా రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో అర్హ కుటుంబాల ఎంపిక, రెండో దశలో ఎంపికైన కుటుంబాలకు ఫ్లాట్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. డ్రా అనంతరం ఎంపికైన కుటుంబాలకు తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి, మండల స్థాయి బృందాలు అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయని తెలిపారు. అర్హత నిర్ధారణ అనంతరం తుది కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి గృహాల స్వాధీనం కల్పిస్తామని వెల్లడించారు. ఎంపిక జాబితాలు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు జిల్లా వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. *2బీహెచ్‌కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలిలా ఉన్నాయి..* ఘనపూర్ (స్టేషన్) మండలం, పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల మొత్తం 57 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల 40 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 8 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు లింగాల ఘనపురం మండలం, కళ్లెం గ్రామ పంచాయతీలో గల మొత్తం 65 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల 30 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 6 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు జఫర్గడ్ మండలం, తిమ్మంపేట గ్రామ పంచాయతీలో గల మొత్తం 34 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తిమ్మంపేట గ్రామ పంచాయతీలో గల 25 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు. జఫర్గడ్ మండలం, తమ్మడపల్లి గ్రామ పంచాయతీలో గల మొత్తం 19 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వావిలాల గ్రామ పంచాయతీలో గల 13 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 13 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఆడిట్ అధికారి దేవేందర్, లింగాల ఘనపురం, జఫర్గడ్, ఘనపూర్ (స్టేషన్) తహసీల్దార్లు స్వప్న, శ్రీనివాస్, ఆండాలు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పేద కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, లబ్ధిదారుల ఇంటికెళ్లి ప్రొసీడింగ్స్ అందచేసిన జనగామ మున్సిపాల్ కమీషనర్ రాజశేఖర్ రెడ్డి

పేద కుటుంబానికి అండగా నిలిచిన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ————————————————————————– జనగామ, సెప్టెంబర్ 14,పున్నమి జిల్లా ప్రతినిధి : మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు – లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి. వినాయక చవితి పర్వదినాన *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మానవతా దృక్పథంతో స్పందించి, ఓ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అండగా నిలిచారు. పేద, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా ప్రత్యేక చొరవ చూపుతున్న *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతకు మరో ఉదాహరణగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం నిలిచింది. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన *మామిడ్ల పద్మ* ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ *జిల్లా కలెక్టర్* సోమవారం, ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారురాలు గతంలో ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్‌మెంట్ నిర్మించుకున్నారు. అయితే అవసరమైన ప్రక్రియలో సాంకేతిక సమస్యల కారణంగా నిర్మాణ దశ పోర్టల్‌లో నమోదు కాలేదు. *జిల్లా కలెక్టర్* ఈ విషయాన్ని పరిశీలించి, లబ్ధిదారురాలి అర్హతలను ధృవీకరించిన అనంతరం ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదేశాల మేరకు, జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు లబ్ధిదారురాలి ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రొసీడింగ్స్‌ను *మామిడ్ల పద్మ* కు అందజేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణ దశల వారీగా లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో జమ కానుంది. అలాగే, మున్సిపల్ కమిషనర్ ఇంటి నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ పర్మిషన్‌ను వెంటనే జారీ చేయడంతో పాటు, వార్డు స్థాయి సిబ్బంది లబ్ధిదారురాలికి అవసరమైన ప్రక్రియలో సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ సెక్షన్ ఇన్‌చార్జి జెస్సికా, కౌన్సిలర్ అనూష కృష్ణ పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.

జనగాం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలన –జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ——————————————————————- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల గ్రామ పంచాయతీలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన *కలెక్టర్*, ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు వచ్చాయని ఆరా తీశారు. దీనికి లబ్ధిదారులు ఇప్పటి వరకు మూడు విడతలుగా బిల్లులు వచ్చాయని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని కూడా *కలెక్టర్* అడిగి తెలుసుకున్నారు. ఇంకా రెండు (లేదా) మూడు రోజుల్లో ఇంటికి తలుపులు బిగించి, సున్నం కూడా వేయించాలని లబ్ధిదారులకు *కలెక్టర్* సూచించారు. పనులను త్వరగా పూర్తి చేస్తే మరో బిల్లు మంజూరవుతుందని వెల్లడించారు. దీనికి స్పందించిన లబ్ధిదారులు పనులను వేగంగా పూర్తి చేస్తామని *కలెక్టర్‌కు* వివరించారు. ఈ క్రమంలో *బండిపల్లి పద్మ, తోటకూర శారద* నిర్మిస్తున్న ఇళ్లను *కలెక్టర్* పర్యవేక్షించారు. వివిధ దశల్లో పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామంలోని నివాస ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. త‌ద్వారా దోమ‌లను నివారించి, వ్యాధులను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన గైని శంకరయ్య పి ఎస్ హెచ్ ఎం,

జి.శంకరయ్య, పిఎస్ హెచ్ఎం,కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ——————————— ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గైని శంకరయ్య పి ఎస్ హెచ్ ఎం, ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి చేతుల మీదుగా ఘనంగా సన్మానం పొందడం జరిగింది అని శంకరయ్య తెలిపారు.ఈ సందర్బంగా శంకరయ్య మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్దత, అంకిత భావం, క్రమశిక్షణ తో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ను అందచేస్తూ, ఎం పి పి ఎస్ కోలుకొండ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లి దండ్రులను ఒప్పించి చదువు నేర్పడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. శంకరయ్య కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయులు,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

జనగాం

అన్ని మండలాల చెరువులకు దేవాదుల నీరు విడుదల కు చర్యలు:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్

జనగామ మండలంలో ఉన్న అన్ని గ్రామాల చెరువులకు తొందర్లో దేవాదుల నీరు విడుదలకు చర్యలు —————————————————————– జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి* గారి సూచన మేరకే ఈరోజు జనగామ మండలం లో ఉన్న ప్రతి గ్రామాలలో సాగు నీరు కోసం చెరువులకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను మండల కాంగ్రెస్ నేతలతో కలిసి కోరిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్*అన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ DE మనమదరావు, గారికి నీటి విడుదల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం DE మనమదరావు మరియు AE రాజు గార్లతో కాంగ్రెస్ నాయకులు కలిసి ఆయా గ్రామాల కెనాల్ కాల్వలను సందర్శించి ప్రతి గ్రామం కి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నాయకులు అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి,జిల్లా నాయకులు సర్వాల నర్సింగరావు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, AMC డైరెక్టర్ లు బానోతు బన్సీ నాయక్,శీలం కొండల్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు సాదం మధుసూదన్, సంకటి యాదగిరి,సర్పంచులు జానేపల్లి జనార్ధన్ రెడ్డి,శ్యామ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల్నే సుధాకర్,వంశీ,సంపత్,బిక్షపతి, కృష్ణ రెడ్డి, చమకూర శ్రీహరి, ఏళ్ల సంతోష్ రెడ్డి,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోదాల వంశీధర్ రెడ్డి, బక్క ప్రవర్ధన్, నర్రా సిద్దారెడ్డి, గందమల కమలాకర్, సుంకరి ఉపేందర్ రెడ్డి,బి సత్యనారాయణ, బొంకురి రాజు,కనకరాజు, వేణు,శ్రీను,రాజేష్,హరీష్ మరియు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పెంబర్తి గ్రామం లో ఘనంగా బోనాలు నిర్వహించిన విశ్వ కర్మీయులు

పెంబర్తి విశ్వకర్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు ——————————————————————— పెంబర్తిలో పొలాల అమావాస్య పర్వదినం సందర్భంగా పెంబర్తి విశ్వకర్మ కుటుంబాలు ఉమ్మడిగా నగర సంకీర్తన (భజన కీర్తనలతో) గ్రామంలోని ఇరువురు చిన్న పోచమ్మ, పెద్ద పోచమ్మ దేవాలయాలను దర్శించి ఘనంగా పూజలు నిర్వహించారు. పూర్వకాలం నుండి సాంప్రదాయంగా శ్రావణ మాసంలో పోచమ్మ తల్లి దేవతలను విశ్వకర్మలు మొదట పూజలు నిర్వహించి నైవేద్యము సమర్పించిన పిదప శ్రావణ మాస పూజలు ప్రారంభమవుతాయి, తదుపరి శ్రావణమాస చివరి రోజు అయిన పొలాల అమావాస్య రోజు ఘనంగా పూజలు నిర్వహించి శ్రావణమాసానికి వీడ్కోలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఇట్టి కార్యక్రమాన్ని నేడు పెంబర్తి గ్రామంలో విశ్వకర్మలు ఘనంగా నిర్వహించి పోచమ్మ తల్లి దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అయిలా సోమబ్రహ్మచారి,అధ్యక్షులు అయిలా కృష్ణమాచారి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్యాల జనార్ధనచారి,కార్యదర్శి రంగు నరసింహచారి, సంఘం నాయకులు కూరోజు బుచ్చయ్య చార,సంపతాచారి, అయిలా సోమనరసింహచారి, మాధవచారి,రుద్రోజు శ్రీనివాస చారి,మక్తాల కుమారస్వామి, నరసింహచారి,చిన్న అనంత చారి తదితరులు పాల్గొన్నారు.

జనగాం

వైష్యుల భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి :జనగాం జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్

వైష్యులకు ప్రభుత్వం కేటాయించిన భూమి పూజ మరియు ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం దిగ్విజయం చేయాలి :ప్రమోద్ కుమార్ ———————————————————— జనగామ, సెప్టెంబర్ 11,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన వైశ్యులకు ఉప్పల్ బాగాయతులో హైదరాబాదులో 5 ఎకరళ కేటాయించిన స్థలంలో మన వైశ్య జాతి ఉన్నతికి అద్దం పట్టే విధంగా వివిధ రకాల ఉపయోగకరమైన నిర్మాణం నిర్మించుటకు మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వారు తేదీ 13-9-2026 రోజున ఉదయం 10:30కు భూమి పూజ కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణము మరియు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుటకు గాను ముహూర్తం నిర్ణయించడం జరిగింది అని గంగిశెట్టి మనోజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మరియు ముఖ్యఅతిథిగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు హాజరు అయి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు,కావున మన వైశ్యులందరూ ముఖ్యంగా మన జనగామ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు కోశాధికారి బేజగం బిక్షపతి రీజియన్ చైర్మన్లు పడకంటి రవీందర్ సరాబ్ ఆంజనేయులు మహిళా విభాగము డాక్టర్ మదoశెట్టి వరూధిని గంగిశెట్టి అనూజ తమ్మి స్రవంతి మరియు జనగామ మండల కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు తదితరులు కోరుచున్నారు అక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ అల్పాహారము మరియు విందు ఏర్పాటు చేయబడినది అని మనోజ్ తెలిపారు.

జనగాం

ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం

ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం ———————————————— జనగాం, సెప్టెంబర్ 10,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ జిల్లా స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్ల విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆవుల అశోక్ వ్యాయమదర్శకులు జడ్పిహెచ్ఎస్, చీటూరు జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులచే ఘనంగా సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం మరియు జనగామ జిల్లా అథ్లెక్స్ అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ వృత్తిపరంగా అనేకమంది క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేవిధంగా తర్ఫీదును ఇస్తూ అలాగే సమాజంలో మంచి పౌరునిగా అందరి పేరు మనల్ని పొంది ఈరోజు జనగామ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం అభినందనీయమని తెలియజేశారు, అశోక్ గారు మాట్లాడుతూ తనకు వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తనకు సంతోషాన్నిచ్చిందని అదేవిధంగా ఇక ముందు ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఎక్కువ సేవలను అందించడానికి బాధ్యతను పెంచిందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు వేదాంతం రవి, గౌస్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమల్, కానుగంటి శేఖర్, పోతర్ల వినోద్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పాండురంగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ, నరేష్, బంటి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.