Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

కల్లలైన నా తెలంగాణ కల (ళ ): “కవిత ” దురుసోజు దుర్గాచారి

కల్లలైన నా తెలంగాణ కల ( ళ ), దురుసోజు దుర్గాచారి ———————————— కల్లలాయే నా తెలంగాణా కలలు కళ లేమో కంచికాయే మసి బారే మాణిక్యాలు మకిలి బట్టే మధు ర ఫలాలు. మచ్చుకైనా లేరైరి మర్యాద రామన్నలు ముంచేటోళ్లేమో ముదిరి పో సాగిరి. మోస గాళ్లేమో మొహరిస్తుo డి రి. సదువులు సట్టు బండలాయే డిం భకులేమో నిరక్షర కుక్షులైరి. సమాజమేమో సాకిరేవాయే సోయి లేని సన్నాసులేమో సోమరి పోతులు అవుతుండిరి. జీడీపీ యేమో జండా ఎగిరేసే పేదరికమేమో కాలారేగిరిసే వెలకట్టలేని లేని విలువలేమో వెల వెల పోయే. ప్రజా పాలనేమో యెగిరి పాయె ప్రజా సేవేమో ఇగిరి పోయే ప్రకృతేమో పగబట్ట సాగే పాపపు జనాలేమో వికృత చేష్టలు డగ సాగిరి. ఆన కట్టలేమో క్రుంగు బాటుతో కుంగుడాయే ఆరు గాలం అన్నం పెట్టె రైతుకేమో కడగo డ్లాయే నోటుకు ఓటేసు డాయే కాసుల కక్కుర్తి తో దొరికినంత దోసుకొనుడాయే కాండక్ట్ / క్యారెక్టర్ లేని కాంట్రాక్టర్లయే సుడిగుండంలో సామాన్యులు మునిగి పోవుడాయే మది నిండా కలతా యే కాసింత కునుకు లేకపోయే మధుర ఫలమేమో మేడిపండాయే ఎన్నటికీ స్సకారమౌతుందో నా ( తెలంగాణా ) కల? ఎప్పటికి మాగుతుందో అపరిపక్వ ఫలం?

జనగాం

ఫీజు ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని జనగామ ఎం ఆర్ ఓ కు బిజెపి నాయకులు మెమోరాండం

జనగామ పట్టణంలోని ఎమ్మార్వో కు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ ఆధ్వర్యంలో మెమొరం ఇవ్వడం జరిగింది ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్న 14వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని లేనియెడల దశలవారీగా ఉద్యమాలు చేపడతామని మొన్న అసెంబ్లీ ముట్టడి రేపు మంత్రు లను బయటికి తిరగకుండా విద్యార్థులు అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును ఏలాంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నికల్లో వాగ్దానం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కన్వీనర్ పిట్టల సత్యం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి, ఎనగందుల కళ్యాణి , గంధం రాములు , దూసరి శివకృష్ణ, సీనియర్ నాయకులు కీర్తి నర్సయ్య, సాంబ శ్రీనివాస్, మొదలగు వారు పాల్గొనడం జరిగింది

జనగాం

జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షులు గా బి. వీరాంజనేయులు

జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షునిగా బి వీరాంజనేయులు —————————————————————- ఈరోజు జిల్లా జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టియుసి సర్వసభ్య సమావేశ ఏర్పాటు చేయడమైనది దీనిలో భాగంగా సభాధ్యక్షుడు నీలం ఐలేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఈ శ్రీధర్ ఎన్నికలను పర్యవేక్షించారు అలాగే జనగామ జిల్లా అధ్యక్ష బివిరాంజనేయులు, కార్యదర్శిగా సిహెచ్ నరేందర్ రెడ్డి మరియు జనగామ డివిజన్ అధ్యక్షులు మూల మహేందర్ కార్యదర్శిగా కే విజయ్ కుమార్ మరియు ఘనపూర్ డివిజన్ అధ్యక్షులుగా బి శ్రీధర్ కార్యదర్శిగా ఫయాజ్ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది కార్మికులు డివిజన్ స్థాయిలో పాల్గొనడం జరిగినది

జనగాం

సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి

జనగామ,సెప్టెంబర్ 8,పున్నమి జిల్లా ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని చలో అసెంబ్లీ ముట్టడి కి రాష్ట్ర అధ్యక్షులు రామచందరావు గారి పిలుపు మేరకు జనగాం జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన బిజెపి నాయకులు అసెంబ్లీ ముట్టడి లో భాగంగా జనగాం జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది.వారిని హైదరాబాద్ లోని స్థానిక శ్రీకర హాస్పిటల్ -లక్డీకపూల్ లో చేర్పించడం జరిగింది.బీజేపి రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి(KSR) హరీష్ రంజిత్ పెద్దోజు జగదీష్ హాస్పిటల్ లో డాక్టర్ ని అడిగి వివరాలు తెలుసుకొని సాధారణ స్థితి వచ్చేవరకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అని తెలిపారు

జనగాం

ఛలో హైదరాబాద్ సెప్టెంబర్ 10 ను మహాధర్నా ను విజయవంతం చేయండి:డి .శ్రీనివాస్ టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

సెప్టెంబర్ 10, చలో హైదరాబాద్ – మహా ధర్నా ను విజయవంతం చేయండి —- టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. డి. శ్రీనివాస — —- – —- —— — — – — ————————– జనగామ, సెప్టెంబర్ 7,పున్నమి ప్రతినిధి : ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యల సాధన కొరకు టిజిఇ జెఎసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ మహాధర్నా ను విజయ వంతం చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను కోరారు. ప్రజా ప్రభుత్వం గా చెప్పుకునే ప్రభుత్వం, ప్రజలలో భాగమైన ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలు అమలు చేయక పోవడం శోచనీయం అన్నారు. 6 డి ఏ లు, పిఆర్సి పెండింగ్ లో పెట్టి, రిటైర్ మెంట్ బకాయిలు చెల్లించక, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించక ఉద్యోగులను వేధించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సెప్టెంబర్ 10 న జరిగే చలో హైదరాబాద్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యతకు, పోరాట పటిమకు నిదర్శనం కావాలన్నారు. ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్నారు. జనగామ నుండి అధిక సంఖ్యలో తప్పనిసరిగా చలో హైదరాబాద్ మహా ధర్నా లో పాల్గొనాలని, అందుకొరకు అన్ని సంఘాల మండల శాఖలు, జిల్లా కమిటీలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అన్నారు. మన హక్కులు మన ఐక్య పోరాటం తోనే సాధ్యమని డి శ్రీనివాస్ టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు

జనగాం

తుంగ మౌనిక టీచర్ కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

కష్టాల కడలిని దాటి కర్తవ్య శిఖరాలను అధిరోహించిన “మౌనిక ” ——————————————————————– జనగామ, సెప్టెంబర్ 7,పున్నమి జిల్లా ప్రతినిధి : కూలి నాలి చేసిన తల్లి కలను నిజం చేసి… విద్యావెలుగులు పంచుతున్న ఆదర్శ ఉపాధ్యాయురాలు కొత్తపల్లి, లింగాలఘనపురం మండలం, జనగామ జిల్లా: జీవితం పూలబాట కాదు… ముళ్లబాటలోనూ మనసులోని లక్ష్యాన్ని చెదరనీయకుండా ముందుకు సాగితే విజయశిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన మహిళ **శ్రీమతి తుంగ మౌనిక **ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, విద్యపై మక్కువతో తన లక్ష్యాన్ని సాధించి, నేడు ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఆమె జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. “తల్లి కష్టాల నీడలో పుట్టిన విద్యా సంకల్పం” కొత్తపల్లి గ్రామానికి చెందిన తుంగ రాములు–రాములమ్మ దంపతులకు జన్మించిన మౌనిక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆ విషాదం కుటుంబాన్ని కష్టాల కడలిలోకి నెట్టినా, ఆమె తల్లి రాములమ్మ మాత్రం వెనుకడుగు వేయలేదు. కూలి నాలి చేసుకుంటూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ, తన కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని తల్లి కన్న కలను గుండెల్లో దాచుకుంది. “నా బిడ్డ ప్రయోజకురాలు కావాలి” అన్న తల్లి ఆకాంక్షే “మౌనిక” జీవిత లక్ష్యానికి తొలి మెట్టు అయింది. తల్లి చెమట చుక్కల్లో తన భవిష్యత్తును చూసుకున్న మౌనిక కష్టాలను కారణాలుగా కాకుండా, విజయానికి సోపానాలుగా మలుచుకున్నారు. “చిన్ననాటి కల… ఉపాధ్యాయ వృత్తిగా సాకారం” చిన్నతనం నుంచే “నేను టీచర్ కావాలి” అనే సంకల్పాన్ని హృదయంలో నాటుకున్న మౌనిక, విద్యను అత్యంత ఇష్టంగా అభ్యసించారు. అడ్డంకులు ఎన్నెదురైనా చదువుపై మక్కువను మాత్రం వీడలేదు. విద్యాభ్యాసంలో ప్రతిభను కనబరుస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి “తెలుగు లిటరేచర్లో” ఎం.ఏ. పట్టా పొందారు. అనంతరం ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసి, తన చిరకాల స్వప్నమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. 2024 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం ఆమె జీవితంలో ఒక మైలురాయి. అనంతరం చారిత్రక నేపథ్యం కలిగిన కడవెండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. “విద్యార్థులే లక్ష్యం… వారి వికాసమే ధ్యేయం” ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన కాలం తక్కువే అయినా, మౌనిక తనదైన ముద్రను వేస్తున్నారు. పాఠ్యబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, మానవీయ విలువలు, సత్ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి జీవన విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థుల ఉన్నతి కోసం నిరంతరం పాటుపడుతూ, వారి సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యమవుతూ, విద్యార్థుల పట్ల ఆప్యాయతను, బోధన పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే ఆమెకు విద్యార్థుల నుంచి లభిస్తున్న ప్రేమాభిమానాలు, తోటి ఉపాధ్యాయులు–ప్రధానోపాధ్యాయుల నుంచి లభిస్తున్న ప్రశంసలు, గ్రామస్తుల నుంచి లభిస్తున్న మన్ననలు ఆమె సేవకు లభించిన సహజమైన గౌరవంగా చెప్పవచ్చు. “ప్రతిభకు పురస్కారం… సేవకు సముచిత గౌరవం” మౌనిక చేస్తున్న సేవా కార్యక్రమాలు, విద్యార్థుల పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధ స్వచ్ఛంద సేవా సంస్థల దృష్టిని సైతం ఆకర్షించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ 320F సంయుక్తంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమంలో ఆమెకు స్థానం లభించడం విశేషం. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన అనతికాలంలోనే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందడం ఆమె అంకితభావానికి, కృషికి లభించిన అరుదైన గౌరవం. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బుర్ర రమేష్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “తల్లి త్యాగానికి బిడ్డ సాధించిన విజయమే ప్రతిఫలం” మౌనిక విజయగాథలో అత్యంత హృద్యమైన కోణం ఆమె తల్లి రాములమ్మ చేసిన త్యాగం. ఒకప్పుడు కూలి పనులు చేస్తూ తన బిడ్డ చదువుకోసం చెమటోడ్చిన తల్లి… నేడు తన కుమార్తె విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలిగా ఎదగడాన్ని చూసి గర్వించే స్థాయికి చేరుకున్నారు. తల్లి చేతుల్లోని కష్టాల గీతలు… బిడ్డ చేతుల్లోని విజయరేఖలుగా మారాయి. తల్లి చిందించిన చెమట… బిడ్డ సాధించిన విజయానికి పునాదిగా నిలిచింది. ఇది కేవలం ఒక మహిళ విజయగాథ కాదు; తల్లిదండ్రుల త్యాగం, బిడ్డ పట్టుదల కలిస్తే అసాధ్యమంటూ ఏదీ లేదని చాటిచెప్పే జీవన సందేశం. ఆదర్శ దాంపత్యం… ఆశయ సాధనకు సహచరుడి తోడ్పాటు జీవిత ప్రయాణంలో తనకు అండగా నిలిచే చక్కటి సహచరుడు రమేష్ ను పొంది దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న మౌనిక, కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటుంబం అందించే ప్రోత్సాహం, సహచరుడి సహకారం, తల్లి అందించిన విలువలు—ఇవన్నీ ఆమె వ్యక్తిత్వ నిర్మాణంలో అంతర్లీన శక్తులుగా నిలిచాయి. మౌనిక… ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి : కష్టాలను చూసి కుంగిపోకుండా… అవకాశాల కోసం ఎదురుచూడకుండా… తనలోని ప్రతిభను పదును పెట్టుకుంటూ… లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకుండా సాగిన “మౌనిక” ప్రస్థానం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆదర్శప్రాయమైనది. తల్లి త్యాగాన్ని విజయంగా మలిచిన కుమార్తెగా, విద్యను ఆయుధంగా చేసుకున్న విద్యావంతురాలిగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుగా, మానవీయ విలువలను బోధించే మార్గదర్శిగా, అనతికాలంలోనే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన మౌనిక— తన జీవితం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. “పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు… మన సంకల్పమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.” అందుకే మౌనిక జీవన ప్రస్థానం ఒక విజయగాథ మాత్రమే కాదు—కష్టాల మధ్య కలలను కనే ప్రతి ఒక్కరికీ, ఆ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి యువతికి, ప్రతి ఉపాధ్యాయునికి ఒక సజీవ ప్రేరణ.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక ఆదర్శ ఉపాధ్యాయురాలికి అక్షరాంజలి…..

జనగాం

జనగామ పట్టణం మహంకాళి ఆలయం లో విశేష పూజలు

జనగామ పట్టణం లోని మహంకాళి ఆలయం పురాతన మైనది ————————————————————— జనగామ, సెప్టెంబర్ 7,పున్నమి జిల్లా ప్రతినిధి : జైన సాంప్రదాయంతో సంబంధాలు కలగిన జనగామ పట్టణంలో ఉన్న మహంకాళి ఆలయం ఎంతో పురాతనమైనదని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పాముకుంట్ల కుమార్,అధ్యక్షులు రంగు వీరస్వామి తెలిపారు.1970 దశకం వరకు ఇట్టి దేవాలయం తో పాటు, గణపతి దేవాలయం మరియు గ్రామ దేవతలైన పోచమ్మ, మాతమ్మ దేవాలయాలు ఊరు పొలిమేరగా ఉండేవి. క్రమేణా ఊరు పెరగడం వలన ఈ ఆలయాలు ఇప్పడు నగరం నడిబొడ్డున వున్నాయి. జైన సంప్రదాయానికి అనవాలుగా మహావీరుని శిల్పం మనకు మహంకాళి మాతా ఆలయంలో దర్శనము ఇస్తుంది.ఇంతటి పురాతనమైన ఈ మహంకాళి ఆలయమును 2017 సం. లో పునఃరనిర్మాణం చేయడం జరిగింది. శక్తి స్వరూపిని అయినా మహంకాళి అమ్మవారు భక్తులను చల్లగా చూస్తుందని నిండుమనసుతో భక్తితో అమ్మ వారిని కొలిచే భక్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి అమావాస్య రోజు దేవాలయంలో అన్నవితరణ కార్యక్రమము. ఆశాడ శ్రావణ మాసాలాలో విశేష పూజలు, హోమాలు వివిధ రూపాలలో అమ్మవారికి అలంకరణలు , మరియు బోనాల జాతరలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాలన్నిటిని ఆలయకమిటి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుంది. ఆలయ కమిటీలో గౌరవాధ్యక్షులు పాముకుంట్ల ప్రసాద్ కుమార్, అధ్యక్షులు రంగు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి రంగు లక్ష్మణ్, కోశాధికారి పాముకుంట్ల మధుసూదన్ ఉపాధ్యక్షులు కసాబు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.అనేక సంవత్సరాలనుండి శ్రావణమాసంలో అలంకరణ చేసి భక్తి శ్రద్ధ లతో పూజలు నిర్వహిస్తారని భక్తులు అనేక మంది వారి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకుంటారని ఆలయ కమిటీ వారు తెలిపారు

జనగాం

ఛలో హైదరాబాద్ఇందిరా పార్కె మహాధర్నా కు భారీ తరలింపు

ఛలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా కు భారీ తరలింపు :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ —————————————————————– జనగామ, సెప్టెంబర్ 5,పున్నమి పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా కు భారీ గా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ 22 ఏ నిషేధిత జాబితాలో మధ్యతరగతి ప్రజల ప్రైవేటు భూములు రైతుల భూములు నిరుపేదలకు సంబంధించి 50 100 గజాల స్థలాలు కూడా 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుమారు 50 లక్షల మంది సామాన్య పేద ప్రజలు రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని 22 ఏ నిషేధిత జాబితాలో అక్రమంగా పేదల భూములు చేర్చి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని 22 ఏ నిషేధిత భూములలో ప్రజలకు న్యాయం జరిగే వరకూ బిజెపి హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బిజెపి ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మహాదరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయకపోతే బిజెపి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పోడుగుల రమేష్ బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ యువ మోర్చా అధ్యక్షులు హరీష్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి మండల అధ్యక్షులు మైపాల్ మహిళా మోర్చా నాయకులు ఎనగందుల కళ్యాణి మూటకొండూరు రమాదేవి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందారపు యాదగిరి మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి సంజీవ్ మండల దూల్మిట్ట అధ్యక్షులు కోడం యాదగిరి తదితరులు పాల్గొన్నారు

జనగాం

జనగామ పట్టణం ఎస్వి నగర్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జనగామ పట్టణం వైష్ణవి గార్డెన్, ఎస్ వి నగర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కాలనీలోని పిల్లలందరూ ఆటపాటలతో కృష్ణుని గోపిక వేషధారణ వేసుకుని కాలనిలో అందరు స్నేహపూర్వకంగా కల్మషం లేని హృదయంతో ఎంతో సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడాన్ని కొనియాడారు. కాలనీలోని పెద్దలు అందరూ ఆటపాటలను,గోపికలు, కృష్ణా వేశాధారణ చూసి సంబర పడ్డారు, ఎంతగానో మురిసిపోయారు. ఇలాంటి పండుగలు,వేడుకల ద్వారా పిల్లలలో ఉన్న ఉత్సాహాన్ని వారిలోని పరిపక్వతను బయటికి తీసి వారి తీపి జ్ఞాపకాలు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఎంతగానో దోహదపడుతాయాని వారి తల్లి దండ్రులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లలు రేణుకుంట్ల సాన్వి,యశ్విత, అన్విత గోపికలు, శ్రీకృష్ణ వేశాధారణ లో అద్భుతంగా అలరించారు.తల్లి దండ్రులు రేణుకుంట్ల బాబా సనత్ కుమార్,సంధ్య,తాతయ్య నానమ్మ మురళి, రేఖ సంతోషం వ్యక్తం చేస్తూ పిల్లలను అభినందించారు.

జనగాం

ఎస్సీ వర్గీకరణ సార్దకతఎక్కడ? గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

ఎస్సీ వర్గీకరణకు సార్థకత ఎక్కడ? గాయక్వాడ్ తులసిదాస్, మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ——————————————————————— జనగామ,సెప్టెంబర్ 4,పున్నమి జిల్లా ప్రతినిధి : తరతరాలుగా ఎదురవుతూ వస్తున్న వివక్ష, అసమానతలను నిర్మూలించడంలో భాగంగా సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఎస్సీ వర్గీకరణతో కొన్ని కులాలు రిజర్వేషన్ల పరంగా నష్ట పోవడమే కాకుండా చివరకు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో తెలంగాణ రాష్ట్రంలోని … కొన్ని కులాలకు ఆ వర్గీకరణ ఫలాలు అందకుండా పోతున్నాయి. ఇది తెలంగాణలోని అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజల ముందున్న అతి ప్రధానమైన ప్రశ్న. 01.08.2024 రోజున భారత సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నెం.2317 / 2011 ) కేసులో షెడ్యూల్డ్ కులాలలో ఉపవర్గీకరణ డిమాండ్ న్యాయబద్ధమైనది చెబుతూనే, సామాజిక వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పు యొక్క అసలు ఉద్దేశం రిజర్వేషన్ ప్రయోజనాలు ఇప్పటికే కొంతమేర లబ్ధి పొందిన కులాలకే పరిమితం కాకుండా, అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజలకు కూడా సమాన అవకాశాలు అందేలా చేయడం. అదే నిజమైన సామాజిక న్యాయం. తెలంగాణలో వర్గీకరణ – కానీ ఫలితం ఎంత? సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఫలాల పంపిణీకి శాసనబద్దంగా చర్యలు తీసుకున్నది. Telangana Scheduled Castes (Rationalisation of Reservations) Act, 2025 ( Act No.15 of 2025) ద్వారా ఎస్సీలోని 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఈ చట్టం ప్రకారం గ్రూప్ – 1లో 15 కులాలను చేర్చి, ఎస్సీలకు కేటాయించిన 15% రిజర్వేషన్‌లో 1 శాతం గ్రూప్ – 1కి, 9 శాతం గ్రూప్ – 2కి, 5 శాతం గ్రూప్ – 3కి కేటాయించారు. గ్రూప్ – 1 జాబితాలో బావురి, బేడ (బుడ్గ) జంగం, చచాటి, దక్కలి, జగ్గలి, పంబాల, మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, మాష్టీ, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు మొదలగు 15 కులాలు ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అత్యంత వెనుకబడిన 15 కులాలకు కేవలం 1% సరిపోతుందా?. ఒకవైపు ప్రభుత్వం, తన దగ్గర ఉన్న అన్ని రకాల సమాచారం ఆధారంగా ‘సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన / పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు’గా ఈ 15 కులాలను ప్రత్యేకంగా గుర్తించి గ్రూప్-1లో చేర్చింది. మరోవైపు జనాభా ఆధారంగా అదే 15 కులాలకు కేవలం 1% రిజర్వేషన్ కేటాయించింది. అంటే, వర్గీకరణ ద్వారా అత్యంత వెనుకబడిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించినట్లయితే, ఆ వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు ఇచ్చే అవకాశాలు కూడా అదే స్థాయిలో బలంగా ఉండాలి కదా?. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ (Preferential treatment) తో గతం కన్నా వర్తమానం – భవిష్యత్తు ఘనంగా ఉండాలే తప్పా అధ్వానం కాకూడదు. వెనుకబాటుతనాన్ని గుర్తించి, దానికి తగిన పరిష్కారం ఇవ్వకపోతే వర్గీకరణ చేసి ప్రయోజనం ఏమిటి?. ఒక్క శాతం రిజర్వేషన్ల కారణంగా సరైన అవకాశాలు రాక గ్రూప్-1 లోని 15 కులాల ప్రజల్లో ఆవేదన, అసంతృప్తి వ్యక్తం అవుతోంది .. సున్నా పోస్ట్లతో ఉద్యోగ ప్రకటనలు : అసలు విషయం ఏమిటంటే?, ఉద్యోగ నోటిఫికేషన్‌లలో “SC Group-I”కు పోస్టులే కేటాయించడం లేదు. పోస్టుల సంఖ్య సున్నాగా నిర్ణయించినప్పుడు రిజర్వేషన్ అమలు చేయనట్లే కదా?. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయనప్పుడు వర్గీకరణ వల్ల ఉపయోగం ఏమిటి?. వర్గీకరణ అమలులో మరో ముఖ్యమైన సమస్య, ఇప్పుడిప్పుడే ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న ఈ కులాల విద్యార్థులకు (గ్రూప్-1) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల నోటిఫికేషన్లలో వాస్తవంగా ఎన్ని అవకాశాలు లభిస్తున్నాయి?. గత సంవత్సరం వైద్య విద్య ప్రవేశాల సందర్భంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ వర్గాల వారు వర్గీకరణ ఫలాలు మొదటిసారిగా అధిక సంఖ్యలో పొందారని సంతోషించాము. కానీ ప్రభుత్వం విడుదల చేసిన వివిధ ఉద్యోగ ప్రకటనలలో ఎస్సీ గ్రూప్-1కి కేటాయించిన పోస్టుల సంఖ్య ‘౦’ గా చూపబడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో కూడా శూన్యమే. నల్సార్ యూనివర్సిటీలో ఎస్సీ గ్రూప్-1 కులాల వారికీ న్యాయ విద్య చదువుకోవడానికి ప్రవేశానికి అధికారికంగా అనుమతి లేదు. ఎందుకంటే కేటాయించబడిన సీట్ల సంఖ్య ‘౦’. అంటే భవిష్యత్తులో ఈ కులాల వారు న్యాయవాద / న్యాయమూర్తి వృత్తిలో కనిపించే అవకాశం ఉండదు. గతంలో 15 % రిజర్వేషన్ వల్ల ఆశతోనైనా ఈ 15 కులాల వాళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారు. ప్రస్తుతం 1% రిజర్వేషన్ అమలు వల్ల పోటీలో నిలబడనివ్వకుండానే, మీరు అర్హులు కారంటూ, ఆదుకోవాలసిన ప్రభుత్వమే వివక్షను చూపినట్లయింది. ప్రశ్న కేవలం “1% ఇచ్చారా లేదా?” అన్నది కాదు. “Group-Iలోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఆ 1% రిజర్వేషన్ ప్రతి నియామకంలో, ప్రతి విద్యా ప్రవేశంలో, ప్రతి సంబంధిత అవకాశంలో వాస్తవంగా ఎలా చేరుతోంది?” అన్నదే ప్రశ్న. రిజర్వేషన్ పత్రంలో ఉండటం కాదు … జీవితాల్లో కనిపించాలి. రిజర్వేషన్ అంటే కేవలం ప్రభుత్వ ఉత్తర్వులో ఒక శాతం అని రాయడం కాదు. అది, అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు చెందిన ఒక పేద విద్యార్థికి ఉన్నత విద్యలో సీటు దక్కాలి, ఒక యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం దక్కాలి. ఒక కుటుంబానికి ఆర్థిక, సామాజిక స్థిరత్వం రావాలి. తరతరాలుగా అవకాశాలకు దూరంగా ఉన్న సమాజానికి కొత్త మార్గం తెరుచుకోవాలి. ప్రభుత్వ సంస్థల్లో ఆ వర్గానికి తగిన ప్రాతినిధ్యం పెరగాలి, అప్పుడే రిజర్వేషన్‌కు అర్థం ఉంటుంది. లేకపోతే “రిజర్వేషన్ ఉంది” అని కాగితంపై కనిపించినా, “ప్రయోజనం లేదు” అనే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి ఏమిటి? దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎస్సీ కులాలలో ఉపవర్గీకరణను కేవలం పరిపాలనా విభజన అంశముగా చూడలేదు. వాస్తవంగా అత్యంత వెనుకబడిన కులాలకు ప్రయోజనం చేరేలా substantive equality సాధించడమే దాని రాజ్యాంగ తాత్పర్యం. రాష్ట్రం ఏ వర్గాన్ని లేదా కులాలను మరింత వెనుకబడినదిగా గుర్తిస్తే, దానికి తగిన ప్రాతినిధ్యం మరియు అవకాశాలను కల్పించడానికి ఆధారపూర్వక చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణ యొక్క తుది లక్ష్యం “వర్గీకరణ” కాదు — “సామాజిక న్యాయం”. అట్టడుగున ఉన్న, అభివృద్ధికి నోచుకోని కులాలకు అధిక అవకాశాలు కల్పించి ప్రగతి బాట పట్టించి గౌరవంగా బ్రతికేటట్లు చూడడం. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: గ్రూప్-1లోని 15 కులాల ప్రజలలో సహజంగానే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 1% రిజర్వేషన్ వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలను ఇస్తుంది?. ఎన్ని విద్యా సీట్లు లభిస్తాయి?. ప్రతి నోటిఫికేషన్‌లో గ్రూప్-1వారికీ ఏవిధంగా ప్రయోజనాలు లభిస్తున్నాయి?. “0” పోస్టులు చూపబడుతున్నప్పుడు ఆ 1% రిజర్వేషన్ ఎప్పుడు, ఎలా ప్రయోజనం కలిగిస్తుంది?. ఈ కులం ప్రజలు ఇతర వర్గాలకు సమానంగా ఎప్పుడు అభివృద్ధిలోకి రాగలుగుతారు ?. అత్యంత వెనుకబడిన 15 కులాలకు వాస్తవ ప్రాతినిధ్యం పెరుగుతోందా?. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం డేటాతో కూడిన పారదర్శక సమాధానం ఇవ్వాలి. అవసరమైతే ప్రతి నియామక సంస్థ, ప్రతి విద్యా సంస్థలో గ్రూప్-1కి కేటాయించిన పోస్టులు / సీట్లు, భర్తీ అయిన పోస్టులు, మిగిలిన పోస్టులు వంటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. వర్గీకరణ పేరు కోసం కాదు … న్యాయమైన హక్కు కోసం : ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలుగా జరిగిన పోరాటం యొక్క అసలు ఉద్దేశం ఒక కొత్త క్యాటగిరి సృష్టించడం కాదు. అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు కూడా రాజ్యాంగం కల్పించిన అవకాశాల ఫలాలు అందించడం. అందుకే గ్రూప్-1లోని 15 కులాలకు కేటాయించిన 1% రిజర్వేషన్ నిజ జీవితంలో కనిపించే ఫలితాలను ఇవ్వాలి. వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగం మొదలగు వాటిలో ప్రాతినిధ్యం పెరగకపోతే ప్రజల్లో సహజంగానే ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. “వర్గీకరణ జరిగింది … మరి సామాజిక న్యాయం ఎక్కడ?”. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులో ఉండకూడదు. ఉద్యోగాల్లో కనిపించాలి. విద్యా సంస్థల్లో కనిపించాలి. అన్ని స్థాయిలలోని ఉద్యోగాల్లో స్పష్టంగా కనబడాలి. ప్రభుత్వ ప్రాతినిధ్యంలో కనిపించాలి. అత్యంత వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో కనిపించాలి. అప్పుడే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి నెరవేరుతుంది. అప్పుడే తెలంగాణ ఎస్సీ వర్గీకరణకు నిజమైన అర్థం వస్తుంది. లేకపోతే — వర్గీకరణ పేరులోనే ఉంటుంది … కానీ సామాజిక న్యాయం మాత్రం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సంఘాలు – నాయకులు మౌనం :- ఎస్సీ గ్రూప్ 1 & 2 వర్గాల సమస్యలు, డిమాండ్ల కోసం గొంతుకగా వివిధ సంఘాలు, నాయకులూ, మేధావి వర్గం, ప్రజాప్రతినిధులు, చివరకు మంత్రులు కూడా ముందుకు వస్తారు. కానీ గ్రూప్ 1 వర్గాల కోసం అందరు మౌనం పాటిస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ కులాల వారిలో సమర్ధుడైన బలమైన ఒక్క నాయకుడు లేక పోవడం ఒక కారణమైతే వీరికి సమస్యను ఎలా? ఎక్కడ? సమర్థవంతంగా చెప్పాలో తెలియకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చును. అందరు వీరిని అవసరానికి అనుగుణంగా వాడుకున్నారే తప్పా చేయి అందించిన వారెవ్వరూ లేరనేది వాస్తవం. ప్రభుత్వం – తక్షణ చర్యలు : గ్రూప్-1లో గుర్తించిన 15 అత్యంత వెనుకబడిన, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎస్సీ కులాలకు కేటాయించిన 1% రిజర్వేషన్ వలన వాస్తవంగా జరిగిన మార్పులు, అభివృద్ధి అన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలి. ప్రతి ఉద్యోగ, విద్యా నోటిఫికేషన్‌లలో గ్రూప్-1వారికీ రిజర్వేషన్‌ ఫలాలు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.