సెప్టెంబర్ 10, చలో హైదరాబాద్ – మహా ధర్నా ను విజయవంతం చేయండి
—- టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. డి. శ్రీనివాస
— —- – —- —— — — – — ————————–
జనగామ, సెప్టెంబర్ 7,పున్నమి ప్రతినిధి :
ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యల సాధన కొరకు టిజిఇ జెఎసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ మహాధర్నా ను విజయ వంతం చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను కోరారు. ప్రజా ప్రభుత్వం గా చెప్పుకునే ప్రభుత్వం, ప్రజలలో భాగమైన ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలు అమలు చేయక పోవడం శోచనీయం అన్నారు. 6 డి ఏ లు, పిఆర్సి పెండింగ్ లో పెట్టి, రిటైర్ మెంట్ బకాయిలు చెల్లించక, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించక ఉద్యోగులను వేధించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సెప్టెంబర్ 10 న జరిగే చలో హైదరాబాద్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యతకు, పోరాట పటిమకు నిదర్శనం కావాలన్నారు. ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్నారు.
జనగామ నుండి అధిక సంఖ్యలో తప్పనిసరిగా చలో హైదరాబాద్ మహా ధర్నా లో పాల్గొనాలని, అందుకొరకు అన్ని సంఘాల మండల శాఖలు, జిల్లా కమిటీలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అన్నారు. మన హక్కులు మన ఐక్య పోరాటం తోనే సాధ్యమని డి శ్రీనివాస్
టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు


