తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖమ్మం కాల్వొడ్డు సెంటర్‌లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి రామ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు RVS యాదవ్, ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య, పిల్లలమర్రి వెంకట్, వాళ్లల రమేష్, వీరభద్రం, బోయినపల్లి చంద్రశేఖర్, పిట్టల వెంకట్ నరసయ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు


