Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు:మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు: జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి —————————————————————- తాత్కాలిక ఏర్పాట్లకు ఖర్చు కాకుండా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత జనగామ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ మరియు లైటింగ్ ఏర్పాట్ల కోసం TSNPDCL సహకారంతో ఎస్పీఆర్ స్కూల్ నుండి సూర్యాపేట రోడ్డుపై నెల్లుట్ల బ్రిడ్జి వరకు శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ శాశ్వత విద్యుత్ లైన్ ద్వారా రాబోయే కాలంలో నిమజ్జన కార్యక్రమాలతో పాటు అవసరమైన ఇతర సందర్భాల్లో కూడా లైటింగ్ మరియు విద్యుత్ సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం తాత్కాలిక ఏర్పాట్ల కోసం అయ్యే ఖర్చును తగ్గించడంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. “ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి సాధ్యమైనంత వరకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా వినియోగించాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నాం. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కూడా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే శాశ్వత మౌలిక వసతులుగా అభివృద్ధి చేస్తున్నాం” అని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటుకు సహకరించిన TGNPDCL ఎస్.ఈ. శ్రీ సంపత్ రెడ్డి కి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ పనిని పూర్తి చేయడం పట్ల ఆమె అభినందనలు వ్యక్తం చేశారు. జనగామ పట్టణ అభివృద్ధిలో భాగంగా తాత్కాలిక ఏర్పాట్ల కంటే శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా చర్యలు కొనసాగిస్తామని వారు తెలిపారు.

జనగాం

70 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు ———————————————————————- జనగామ, సెప్టెంబర్ 19,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జనగామ జిల్లా మినీ స్టేడియం, ధర్మకంచలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) జనగామ జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడల్లో అండర్–14, అండర్–17 బాలబాలికలకు పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ముగింపు కార్యక్రమంలో ఇన్‌చార్జి AD గౌసియా బేగం బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి సుమారు 2,400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులకు భోజనం, తాగునీరు తదితర అవసరమైన వసతులను నిర్వాహకులు కల్పించారు. జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో జరిగే తదుపరి పోటీల్లో జనగామ జిల్లా తరఫున పాల్గొంటారని SGF జనగామ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జాటోత్ గోర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మీర కిషన్, గంగిశెట్టి మనోజ్ కుమార్, కిరణ్ కుమార్,కొండా రవి హనుమంతరావు, కె. శ్రీనివాస్, సైదులు రవికుమార్ శ్రీదేవి సుధారాణి దేవ్ సింగ్ రవికుమార్ సాయికుమార్ పాండ్యా వివిధ మండలాల SGF కార్యదర్శులు, PDs/PETs, క్రీడా ఉపాధ్యాయులు మరియు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ SGF జనగామ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

జనగాం

ASI గా పదోన్నతి పొందిన హిదాయత్ అలీ కి ఘన సన్మానం చేసిన TSMESA

ASI గా పదోన్నతి పొందిన హిదయత్ అలీకి ఘన సన్మానం TSMESA ——————————————————————- పోలీస్ శాఖలో 36 సంవత్సరాలుగా క్రమశిక్షణ, నిజాయితీతో సేవలందిస్తూ ఇటీవల *ASI* (Assistant Sub-Inspector) గా పదోన్నతి పొంది జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరిన హిదయత్ అలీ (సమద్) ను TSMESA జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి మాట్లాడుతూ, హిదయత్ అలీ 1990 నుంచి పోలీస్ శాఖలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, నిజాయితీకి మారుపేరుగా సేవలందించారని తెలిపారు. సుమారు 36 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఉద్యోగ నిర్వహణను పరమావధిగా భావిస్తూ పోలీస్ శాఖకు వన్నె తెచ్చిన హిదయత్ అలీ ని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని మహమ్మద్ అంకుషావలి అన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఐదు పూటల నమాజ్‌ను క్రమం తప్పకుండా ఆచరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత హిదయత్ అలీ (సమద్) మాట్లాడుతూ, తనను సన్మానించిన TSMESA ప్రతినిధులకు మరియు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతితో తనపై మరింత బాధ్యత పెరిగిందని, ఉన్నతాధికారుల సూచనలు, సహచరుల సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయడం, ప్రజల రక్షణకు నిరంతరం పనిచేయడం, ప్రజలు అన్ని వేళలా సురక్షితంగా, సంతోషంగా ఉండేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆ విధంగా పనిచేయడంలో కృషి చేస్తానని హిదయత్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ తహసీన్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్, మహమ్మద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

ఈ నెల 23 న గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం విజయవంతం చేయండి :-జనగామ గణేష్ ఉత్సవ సమితి (JGUS)

ఈ నెల 23న గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం విజయవంతం చేయండి – JGUS ———————————————————————- జనగామ గణేష్ ఉత్సవ సమితి సమన్వయ సమావేశం విజయవంతం చేయాలని మండపాల నిర్వాహకులకు పిలుపు.. * **డీసీపీ, మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లతో సమితి ప్రతినిధుల భేటీ** వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 21 వ తేదీన పట్టణంలోని సాయిరాం (కామాక్షి) ఫంక్షన్ హాల్‌లో ‘గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం’ నిర్వహిస్తున్నట్లు జనగామ గణేష్ ఉత్సవ సమితి (JGUS) జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ తెలిపారు. స్థానిక JGUS కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్క కుమారస్వామి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచాల రవీందర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వ విధివిధానాలపై ఈ సమన్వయ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ బంధువులు, గణేష్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. *అధికారులతో మర్యాదపూర్వక భేటీ:** సమావేశం అనంతరం JGUS ప్రతినిధుల బృందం జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, నిమజ్జనం ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో JGUS జిల్లా కోశాధికారి రంగ నరసింహ రావు, ఉపాధ్యక్షులు వారణాసి పవన్ శర్మ, కార్యదర్శులు సాదాం మదన్ మోహన్ యాదవ్, బింగి రమేష్, సంపత్, గండి నాగరాజు, మంగ శ్రీకాంత్, కోలిపాక లక్ష్మణ్, కంచర్ల పవన్, చింతపండు వెంకటేష్, భూక్యా మనోహర్, చందు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

టి ఆర్ పి జనగామ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నరసింహ రాములు నియామకం

జనగామ జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియామకం ———————————————————————- పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేత…. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జనగామ జిల్లా కమిటీలో నియామకం జరిగింది. జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియమితులయ్యారు. పాదయాత్రలో భాగంగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నరసింహ రాములు ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర కార్యవర్గం సూచనల మేరకు,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మల్లన్న మాట్లాడుతూ.. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించిన మాజీ సైనికుడు నరసింహ రాములు పార్టీ బలోపేతం కోసం క్రమశిక్షణతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ ఆశయాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ జనగామ జిల్లాలో పార్టీ నిర్మాణానికి, బలోపేతానికి ప్రత్యేక కృషి చేయాలని కోరుతూ నరసింహ రాములుకు తీన్మార్ మల్లన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నరసింహ రాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కు , రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర ,జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని, అందరినీ కలుపుకుంటూ జనగామ జిల్లాలో పార్టీ జెండాను ఎగురవేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, జనగామ జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, కృష్ణ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు

జనగాం

బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ను పరామర్శించిన ఎస్ టి కమిషన్ జాతీయ సభ్యులు హుసేన్ నాయక్

ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అసెంబ్లీ ముట్టడి బిజెపి కార్యక్రమంలో గాయపడి కోరుకుంటున్న జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ ను వారి నివాసంలో పరామర్శించిన ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యులు శ్రీ హుస్సేన్ నాయక్ సౌడ రమేష్ ను పరామర్శించారు. వారికి మనోధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి మహిళా మోర్చా నాయకులు కళ్యాణి స్వప్న ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు డాక్టర్ సెల్ నాయకులు పెద్ది శశిధర్ గుప్తా కుడుముల అనిల్ కుమార్ ఎండోమెంట్ సెల్ కో కరీంనగర్ పూర్ణచందర్ పట్టణ కార్యదర్శి దూసరి శివ కృష్ణ మోతే జనార్ధన్ ఎస్టి మోర్చా నాయకులు రమేష్ నాయక్

జనగాం

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జనగామ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఓం సాయి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి వచ్చి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకొని 70 మంది రక్తం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య అధ్యక్షతన జెండా ఎగరవేసి విమోచన దినాన్ని జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి గారు రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి కొంతం శ్రీనివాస్ బ్లడ్ క్యాంపు నిర్వహకులు మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ ఉల్లోజు వెంకటేశ్వర్లు జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్ డాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ పెద్ది శశిధర్ పిట్టల సత్యం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు జీవనజ్యోతి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి బంధారపు యాదగిరి పవన్ శర్మ బొమ్మ కంటి అనిల్ ఆవుల శ్రీనివాస్ దూసరి శివకృష్ణ తుడుముల అనిల్ మొదలవారి పాల్గొన్నారు

జనగాం

వ్యవసాయ మార్కెట్తె కార్యలయం లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ———————————————————————– సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప రోజు. *తెలంగాణ విలీన మరియు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జనగామ రైతులకు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు*. ఈరోజు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు . ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుకు శివరాజ్ యాదవ్* ఈ సందర్భంగా *శివరాజ్ యాదవ్* మాట్లాడుతూ 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది అని తెలిపారు. అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తునాము. అని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్* అన్నారు. అదేవిధంగా ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పాలన ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమం లో వ్యాపారులు చేరివిరాల ఉపేందర్, కృష్ణ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు సాదం మధుసూదన్,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బనుక ప్రభాకర్,హమాలీ సంఘం నాయకులు రాజు,వీర స్వామి ,సిద్ధులు,రమేష్, కుమార్,AMC సిబ్బంది బాబు రావు, ఎల్లయ్యా,కృష్ణ, శారద,కుమారస్వామి, ప్రవీణ్, ఉమా మహేశ్వరి, కోమలత, నిరోష,క్రాంతి, సాయి ,మహిళలు, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన పతాకావిష్కరణ:మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన పతాకావిష్కరణ ———————————————————————– జనగామ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు (SHG), పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ కడకంచి బాలమణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, పట్టణ పారిశుధ్యం, పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని సూచించారు. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సేవాభావం కీలకమని పేర్కొన్నారు. జనగామ పట్టణ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, SHG మహిళలు, డ్రైవర్లు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారని మున్సిపల్ కమీషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు

జనగాం

చేయూత పెన్షన్ దరఖాస్తులు క్షేత్ర స్థాయి పరిశీలన వేగవంతం :మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం – జనగామ మున్సిపాలిటీ ——————————————————— జనగామ పట్టణ పరిధిలో చేయూత పెన్షన్లకు సంబంధించి మొత్తం 1,030 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించిన గడువు ఈరోజుతో ముగిసింది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా 13 మంది డిజిగ్నేటెడ్ వెరిఫికేషన్ అధికారులు సహకారంతో, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా 360 డిగ్రీల పరిశీలన మరియు రిమార్క్స్ నమోదు చేస్తూ, చేయూత మొబైల్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హతకు సంబంధించిన రిమార్క్స్‌ను పారదర్శకంగా నమోదు చేస్తున్నారు. మొత్తం 1,030 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 150కి పైగా దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా, 11వ మరియు 12వ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, చేయూత పెన్షన్ దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, సంబంధిత రిమార్క్స్‌ను నమోదు చేశారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పారదర్శకంగా మరియు వేగవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.