చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం – జనగామ మున్సిపాలిటీ
———————————————————
జనగామ పట్టణ పరిధిలో చేయూత పెన్షన్లకు సంబంధించి మొత్తం 1,030 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించిన గడువు ఈరోజుతో ముగిసింది.
దరఖాస్తుల పరిశీలనలో భాగంగా 13 మంది డిజిగ్నేటెడ్ వెరిఫికేషన్ అధికారులు సహకారంతో, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా 360 డిగ్రీల పరిశీలన మరియు రిమార్క్స్ నమోదు చేస్తూ, చేయూత మొబైల్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నారు.
ఈ ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హతకు సంబంధించిన రిమార్క్స్ను పారదర్శకంగా నమోదు చేస్తున్నారు. మొత్తం 1,030 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 150కి పైగా దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయడం జరిగింది.
అదేవిధంగా, 11వ మరియు 12వ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, చేయూత పెన్షన్ దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, సంబంధిత రిమార్క్స్ను నమోదు చేశారు.
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పారదర్శకంగా మరియు వేగవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్
రాజశేఖర్ రెడ్డి తెలిపారు



