Wednesday, 22 April 2026
  • Home  
  • పర్వత రెడ్డి నాయకత్వంలో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ
- ఆంధ్రప్రదేశ్

పర్వత రెడ్డి నాయకత్వంలో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ

నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకీ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. సిటీ ఆఫీసులో 3వ డివిజన్ ఇన్‌చార్జ్ అక్కలరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో జయమ్మకు చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన సభ్యులకు ఎమ్మెల్సీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ ఈ చేరికల ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు..*

నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకీ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. సిటీ ఆఫీసులో 3వ డివిజన్ ఇన్‌చార్జ్ అక్కలరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో జయమ్మకు చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా కొత్తగా చేరిన సభ్యులకు ఎమ్మెల్సీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ ఈ చేరికల ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.