ASI గా పదోన్నతి పొందిన హిదయత్ అలీకి ఘన సన్మానం
TSMESA
——————————————————————-
పోలీస్ శాఖలో 36 సంవత్సరాలుగా క్రమశిక్షణ, నిజాయితీతో సేవలందిస్తూ ఇటీవల *ASI* (Assistant Sub-Inspector) గా పదోన్నతి పొంది జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరిన హిదయత్ అలీ (సమద్) ను TSMESA జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి మాట్లాడుతూ, హిదయత్ అలీ 1990 నుంచి పోలీస్ శాఖలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, నిజాయితీకి మారుపేరుగా సేవలందించారని తెలిపారు. సుమారు 36 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని పేర్కొన్నారు.
ఉద్యోగ నిర్వహణను పరమావధిగా భావిస్తూ పోలీస్ శాఖకు వన్నె తెచ్చిన హిదయత్ అలీ ని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని మహమ్మద్ అంకుషావలి అన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఐదు పూటల నమాజ్‌ను క్రమం తప్పకుండా ఆచరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత హిదయత్ అలీ (సమద్) మాట్లాడుతూ, తనను సన్మానించిన TSMESA ప్రతినిధులకు మరియు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతితో తనపై మరింత బాధ్యత పెరిగిందని, ఉన్నతాధికారుల సూచనలు, సహచరుల సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయడం, ప్రజల రక్షణకు నిరంతరం పనిచేయడం, ప్రజలు అన్ని వేళలా సురక్షితంగా, సంతోషంగా ఉండేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆ విధంగా పనిచేయడంలో కృషి చేస్తానని హిదయత్ అలీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహ్మద్ తహసీన్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్, మహమ్మద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు


