Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేటలో టిఆర్ఎస్ నిరసన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారి ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాయకులు ఆందోళన చేపట్టారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో సర్పంచ్ చిరం నాగరాజు యాదవ్ ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తిప్పర వేణి భాగ్య రోడ్డ సర్వ గద్దల భూమ రాజవ్వ వట్టెల లక్ష్మి జక్కుల రాణి కి ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గురక పరశురాములు కాంగ్రెస్ నాయకులు వంగ మల్లారెడ్డి రొడ్డ రామచంద్రం ఉత్తర్ల లక్ష్మణ్ వట్టెల రాములు వట్టెల రవి చీకట్ల నారాయణ జక్కుల ప్రభాకర్ పాల్గొ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

ఇందిరమ్మ ఇళ్లకు వేగం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు గురువారం సిరిసిల్లలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు లబ్ధిదారులు ప్రభుత్వ సహాయంతో నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

నూతన తహసిల్దార్ కు సర్పంచుల పోరం సన్మానం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆడెపు దివ్య జ్యోతిని మండల సర్పంచుల పోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాజీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి డైరెక్టర్ మండే శ్రీనివాస్ గంట బుచ్చగౌడ్ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలు భాగంగా ఈనెల 5 61213 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆయా రోజుల్లో బిఎల్ఓ లు కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తారు జాబితాలోని తప్పులు మార్పులు ఇతర లోపాలను పరిశీలించి సవరణ చేసుకుని అవకాశం కల్పించనున్నారు

రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయ అభివృద్ధికి భారీ నిధులు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు ఆలయ ప్రాంగణ విస్తరణ నూతన నిర్మాణాలు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగిస్తామన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి భీమన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

రాజన్న సిరిసిల్ల

యూరియా కోసం వీర్నపల్లిలో టిఆర్ఎస్ నిరసన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గురువారం టిఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డుపై బేటాయించి నిరసన చేపట్టారు యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీలు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని నాయకులు పేర్కొన్నారు

రాజన్న సిరిసిల్ల

కొండ సురేఖ భర్త రఫ్ కు సీఎం సిఫారసు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 తెలంగాణ మంత్రి కొండ సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు చేశారు ఈ మేరకు సి ఎస్ లోక భవన్ కు లేక పంపారు దీనిపై గవర్నర్ కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు అటు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి జి.ఎస్.ఎం.సి మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియమించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద కూడా చైర్మన్ గా గుండు సుధారాణి నియమించారు

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ ర్యాలీ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రతిపక్ష నేత కేసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టిఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ సుమారు 500 మీటర్ల మేర ఫ్లెక్సీలు ప్రదర్శించారు గత పది ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడ సబ్ రిజి స్టార్ కార్యాలయానికి మహర్దశ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎట్టకేలకు కొత్త భవనం సమకూరింది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని భవనంలోకి కార్యాలయాన్ని తరలించారు నూతన కార్యాలయాన్ని నేడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు విశాలమైన స్థలం పార్కింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌకర్యం కలగనుంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.