Wednesday, 30 September 2026

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ,* *మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన ఎంపీడీవో సాయిప్రసాద్* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,* }

*లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ,* *మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన ఎంపీడీవో సాయిప్రసాద్* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,* మండల కేంద్రం వాకాడులో మంగళవారం ఉదయం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో సాయిప్రసాద్ లబ్ధిదారులకు పింఛన్‌ మొత్తాలను అందజేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయిప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్‌ అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. లబ్ధిదారులు పింఛన్లు అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు తమకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు. ఎంపీడీవో వెంట ఏవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.

తిరుపతి

*సర్వేంద్రియానం నయనం ప్రధానం..* *కడివేడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం.* *విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ.*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 1 చిల్లకూరు మండలం,* }

*సర్వేంద్రియానం నయనం ప్రధానం..* *కడివేడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం.* *విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 1 చిల్లకూరు మండలం,* సర్వేంద్రియానామ్. నయనం ప్రధానం అన్నట్లు సర్వేంద్రియాలలో అన్నిటికన్నా కన్ను ముఖ్యమైనదని కల్లపట్ల జాగ్రత్త వహించాలని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు. మంగళవారం చిల్లకూరు మండలం గడివేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన దాత ప్రసాద్ ప్రారంభించారు. ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వర ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజల వలన చేసి వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య నిపుణుడు వి. రమేష్ శిబిరానికి హాజరైన వారందరికీ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. కంటిలో శుక్లాలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ ఆసుపత్రి నందు కంటిలో శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులు ఇవ్వనున్న ట్లు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. కంటిలో దృష్టిలోపం ఉన్నవారికి అత్యంత తక్కువలకు కంటి అద్దాలు అందజేయన్నామని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు గ్రామస్తులకు ఉపాధ్యాయ సిబ్బందికి చికెన్ ఫాక్స్ సోకకుండా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి పాఠశాల దాత ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

*అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన అన్నమేటి బాలసుబ్రమణ్యం,*} { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,* }

*అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన అన్నమేటి బాలసుబ్రమణ్యం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,* అమరావతి: వాకాడు గ్రామానికి చెందిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత అన్నమేటి బాలసుబ్రమణ్యం మంగళవారం అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యంతో పాటు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కోర్ కమిటీ సభ్యులు కూడా మంత్రిని కలిసి పలు అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. ఈ భేటీలో రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సహకారం అందించాల్సిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తెలుగు ప్రజలు, టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అందించగల సహకారంపై కూడా చర్చించినట్లు సమాచారం. విద్యా, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్‌లో మరింత సమన్వయంతో పనిచేస్తామని బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను కలవడం సంతోషంగా ఉందని అన్నమేటి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. భేటీ అనంతరం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కోర్ కమిటీ సభ్యులు మంత్రితో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

*రాఘవాపురంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ* *లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ పాశం సునీల్‌కుమార్‌* *పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా సంక్షేమ పథకాలు*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 1 కోట మండలం,* }

*రాఘవాపురంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ* *లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ పాశం సునీల్‌కుమార్‌* *పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా సంక్షేమ పథకాలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 1 కోట మండలం,* కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని రాఘవాపురం గ్రామంలో మంగళవారం ఉదయం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్‌ పాశం సునీల్‌కుమార్‌ స్వయంగా గ్రామానికి చేరుకుని పెన్షన్‌ లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు పెన్షన్‌ అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయడంతో గ్రామంలో సంతోషకర వాతావరణం నెలకొంది. పెన్షన్‌ మొత్తంతో తమ రోజువారీ అవసరాలు, మందులు, కుటుంబ ఖర్చులకు కొంతమేర ఆర్థిక సహాయం లభిస్తోందని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కోట మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెన్షన్‌ లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు సకాలంలో అందడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే డాక్టర్‌ పాశం సునీల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

*స్వర్ణముఖిని కాపాడాలి!* *భారీ యంత్రాలతో ఇసుక, మట్టి తవ్వకాలపై బీజేపీ నిరసన* *కోట మండలంలో నీటి వనరుల పరిరక్షణకై వినతి*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,* }

*స్వర్ణముఖిని కాపాడాలి!* *భారీ యంత్రాలతో ఇసుక, మట్టి తవ్వకాలపై బీజేపీ నిరసన* *కోట మండలంలో నీటి వనరుల పరిరక్షణకై వినతి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,* *నెల్లూరు జిల్లా కోట మండలంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో భారీ యంత్రాలతో ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. నది పరివాహక ప్రాంతంలో ఇసుక, మట్టి తవ్వకాలతో సహజ నీటి వనరులు దెబ్బతింటున్నాయని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతం ఎడారిని తలపించే పరిస్థితికి చేరుతోందని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్తెన అంబరీష ఆరోపించారు. ఇసుక, మట్టి తవ్వకాల ప్రభావంతో జలవనరులు నశించి సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతంలోని పాడైన చెక్‌డ్యామ్‌లను రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించాలని కోరారు. ప్రకృతి వనరుల అక్రమ దోపిడీతో ప్రజలు, రైతులు నష్టపోతున్నారని తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్ అన్నారు. ఇసుకను కొందరు తమ సొంత వనరులుగా భావించి ఇష్టారాజ్యంగా తరలించడం సరికాదని, ప్రకృతి వనరులు ప్రజలందరికీ చెందుతాయని పేర్కొన్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగితే నదులు, వాగులు, నీటి ప్రవాహ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఇసుక వనరుల దోపిడీతో నీటి నిల్వలు, భూగర్భ జలాలపై ప్రభావం పడటంతో పాటు వ్యవసాయం, ఆక్వా సాగుకు అవసరమైన నీటి లభ్యత తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని వెంకయ్య గౌడ్ ఆరోపించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పది ఎకరాల్లో సాగు చేసిన రైతులు ప్రస్తుతం నీటి కొరత కారణంగా రెండు ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి వనరులను సంరక్షించాల్సిన సమయంలో వాటికి అడ్డంకులు ఏర్పడటం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌లు పాడైపోవడంతో పాటు అన్యాక్రాంతమయ్యాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. వర్షపాతం ద్వారా వచ్చే నీటిని సమర్థంగా నిల్వ చేసేలా పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించాలని, సాగునీరు, తాగునీటికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు కోట ఆర్‌ఐ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించవద్దని వెంకయ్య గౌడ్ ప్రాంతీయ నాయకులకు సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో స్థానికంగా జరిగే తప్పిదాలు సైతం కూటమి ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలకు సమాధానం చెప్పగలిగేలా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాదర్తి కోటారెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యుడు దువ్వూరు గిరిధర్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్, కోట మండల అధ్యక్షుడు గునుపూడి హరిబాబు, సామాజిక మాధ్యమాల ఇన్‌చార్జ్ సారంగం నికేష్, మండల కిసాన్ మోర్చా నాయకుడు శరత్ చంద్రారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

తిరుపతి

అన్ని దానాలలో కెల్లా నేత్రదానం గొప్పది. *ముప్పవరపు శ్రీనివాసరావు* పదవీ విరమణ సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం. } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,*}

అన్ని దానాలలో కెల్లా నేత్రదానం గొప్పది. *ముప్పవరపు శ్రీనివాసరావు* పదవీ విరమణ సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,* అన్ని దానాలలో కెల్లా నేత్రదానం గొప్పదని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. సోమవారం కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో అంగనవాడి కేంద్రం సమీపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లం బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య ప్రారంభించారు. ప్రకాశం జిల్లా చీరాల ఏపిఎస్ఆర్టిసి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న సోదరుడు ముప్పవరపు శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని లీలామోహన్ కృష్ణ తెలిపారు. గిరిజన వాడల్లో ఎం వి రావు ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి అక్కడ గిరిజన ప్రాంత వాసులకు దృష్టిలోపాన్ని అరికట్టే నిమిత్తం గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా తమ ఫౌండేషన్ నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలలో నివారణ పై ప్రత్యేక అవగాహన మరియు శిబిరాలు నిర్వహిస్తూ ఆ ప్రాంత వాసుల దృష్టిలోపాన్ని అరికట్టేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య నిపుణుడు వoజీవాక. రమేష్ నేతృత్వంలో శిబిరానికి హాజరైన వారందరినీ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. కంటి అద్దాలు అవసరమైన వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు, అదేవిధంగా కంటిలో శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు తిరుపతి వాసన్ ఐ కేర్ నందు నిర్వహించనున్నామని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అల్లం బాబు, ఆవుల సుబ్బయ్య పాఠశాల ఉపాధ్యాయిని అంగనవాడి సిబ్బంది శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

తిరుపతి

*గిరిజనులల్లో వున్న దృష్టిలోపాన్ని నివారిస్తాం.* *తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగుకు అశ్రునివాళి.*} { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 చిట్టమూరు మండలం,*}

*గిరిజనులల్లో వున్న దృష్టిలోపాన్ని నివారిస్తాం.* *తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగుకు అశ్రునివాళి.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 చిట్టమూరు మండలం,* చిట్టమూరు మండలం గుణపాడు గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న కాలనీవాసులకు గత రెండు రోజుల క్రితం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అందులో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దృష్టిలోపమున్న గిరిజనులకు వృద్ధులకు కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ఆ కాలనీవాసులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం గురించి గిడుగు. వెంకట రామమూర్తి గురించి ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ గిరిజనకు తెలియజేశారు. గిరిజనుకు తెలుగు భాష ఉద్యమ స్ఫూర్తి గిడుగు అని అభివర్ణించారు. అనంతరం దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ. కార్యదర్శి ఎం విజయలక్ష్మి గుణపాడు గిరిజన కాలనీవాసులు దృష్టిలోపం ఉన్న వృద్ధులు పాల్గొన్నారు.

తిరుపతి

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* }

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* *వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట,చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భారీగా ఆవుతోకలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో జరుగుతున్న లోపాలను గురించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని వాకాడు,కోట,చిట్టమూరు మండలకు చెందిన వైఎస్సార్సీపి నాయకులకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

తిరుపతి

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* }

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* *వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట,చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భారీగా ఆవుతోకలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో జరుగుతున్న లోపాలను గురించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని వాకాడు,కోట,చిట్టమూరు మండలకు చెందిన వైఎస్సార్సీపి నాయకులకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

తిరుపతి

*కోట ఏవీకేఆర్ పాఠశాల లో స్ఫూర్తి క్రీడ సందడి, ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు,* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 కోట మండలం,* }

*కోట ఏవీకేఆర్ పాఠశాల లో స్ఫూర్తి క్రీడ సందడి, ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 కోట మండలం,* నెల్లూరు జిల్లా కోట తెలుగు భాషా వికాసానికి గిడుగు వెంకటరామమూర్తి, భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్‌చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. కోట పట్టణంలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల క్రితం 100, 200, 400, 600, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలతో పాటు విద్యార్థులకు నచ్చిన క్రీడాకారుడిపై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలను సబ్‌మెరైన్ ఎస్‌ఐ శివసౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు అంకయ్య, సుబ్రహ్మణ్యం, కళ్యాణి ప్రసంగిస్తూ గిడుగు వెంకటరామమూర్తి భాషా సేవలను వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ క్రీడల ప్రాధాన్యతను వివరించారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా ప్రస్థానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, ఎం.సీనయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.