Wednesday, 30 September 2026

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*కోగిలిలో వేధిస్తున్న విద్యుత్ కోతలు* *రాత్రివేళల్లో అంధకారం.. విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం* *విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి* *అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం – సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 8 చిట్టమూరు మండలం,*}

*కోగిలిలో వేధిస్తున్న విద్యుత్ కోతలు* *రాత్రివేళల్లో అంధకారం.. విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం* *విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి* *అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం – సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 8 చిట్టమూరు మండలం,* ✍️కోగిలి: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ప్రజల నిత్యజీవితానికి అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, కోగిలి గ్రామంలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో* చిన్నారులు, విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికీ అవస్థలు పడుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. *ఎప్పుడు కరెంట్ వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు* కోగిలి గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి స్పష్టమైన సమయపట్టిక లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. *రాత్రి సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోవడం,* కొంతసేపటి తర్వాత వచ్చినా మళ్లీ అంతరాయం ఏర్పడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. దీంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *విద్యార్థుల చదువులకు ఆటంకం* ప్రస్తుతం విద్యార్థులకు చదువు అత్యంత కీలకమైన సమయం. *అయితే రాత్రివేళల్లో విద్యుత్ కోతలు* విధించడంతో విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. *పరీక్షలకు సిద్ధమవుతున్న* విద్యార్థులకు విద్యుత్ అంతరాయాలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని చెబుతున్నారు. *విద్యుత్* లేకపోవడంతో చీకట్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. *కనీస అవసరాలకూ ఇబ్బందులు* విద్యుత్ కోతల ప్రభావం కేవలం చదువులకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబంపైనా పడుతోందని గ్రామస్థులు అంటున్నారు. *రాత్రి భోజన సమయాల్లో సైతం విద్యుత్* నిలిచిపోవడంతో చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. *అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లాలి* విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు అసలు కారణం ఏమిటో అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. *సాంకేతిక సమస్యలు*, మరమ్మతు పనులు లేదా ఇతర కారణాల వల్ల సరఫరా నిలిపివేస్తున్నట్లయితే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ కోతలకు సంబంధించి కొందరు గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వాటిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లంచాల ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది సంబంధిత అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామస్థులు అంటున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి కోగిలి గ్రామంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తరచూ అంతరాయాలకు కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. అవసరమైతే విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పంపిణీ వ్యవస్థలను పరిశీలించి లోపాలను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. “విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలి. ముఖ్యంగా రాత్రివేళల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి. విద్యార్థుల చదువులు, ప్రజల నిత్యజీవితాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి” అని కోగిలి గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల ఫిర్యాదులపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, సమస్యకు కారణం ఏమిటో వెల్లడించడంతో పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి

కోటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,* }

*కోటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,* *నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని అల్లారెడ్డి వెంకటకృష్ణా రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, వివిధ ఆటపాటలతో విద్యార్థులను విశేషంగా అలరించారు. గురువుల ప్రదర్శనలు పిల్లల్లో నవ్వులు పూయించాయి. అనంతరం ఉపాధ్యాయులకు నిర్వహించిన షాట్‌పుట్ తదితర క్రీడా పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటారు. విద్యార్థులు తమ ప్రియతమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం డి.కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే గురువుల ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.*

తిరుపతి

*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయం* * *టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి*} { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,* }

*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయం* * *టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,* *నెల్లూరు జిల్లా కోట మండలంలోని అల్లా రెడ్డి వెంకటకృష్ణా రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పలువురు నాయకులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉనుగుంటపాలెం పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బయ్య, శ్రీ షిరిడీ సాయి సేవాసమితి చైర్మన్ అల్లం రామయ్య ముఖ్య అతిధులుగా పాల్గొని ఉపాధ్యాయులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.అనంతరం దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దారా మస్తానయ్య, పాఠశాల కమిటీ ఛైర్మన్ హజీర్, పిఈటీ వల్లి అహ్మద్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.*

తిరుపతి

*జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు దంపతులకు ఘన సన్మానం* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 వాకాడు మండలం,* }

*జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు దంపతులకు ఘన సన్మానం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 వాకాడు మండలం,* తిరుపతి జిల్లా. వాకాడు: మండల పరిధిలోని గద్దలమెట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రేచల్ కిజియా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై, ఈరోజు గురుపూజోత్సవ సందర్భంగా తిరుపతిలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఆ ఉపాధ్యాయురాలను ఈరోజు సాయంత్రం వాకాడు మండలం విద్యాశాఖ తరఫున ఎంఈఓ నసీం ఆలీ, ప్రధానోపాధ్యాయుడు పిడుగు ప్రవీణ్ ,ఇతరు ఉపాధ్యాయులు ఉత్తమ వార్డు గ్రహీతను, ఆమె భర్త ప్రభు చరణ్ ను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

తిరుపతి

*కోగిలి పంచాయతీలో తడి.. పొడి చెత్త సేకరణ,* *పరిశుభ్రతే లక్ష్యంగా ఇంటింటా చెత్త సేకరణ..* *ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గ్రామం దిశగా అడుగులు,*} { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 చిట్టమూరు మండలం,* }

*కోగిలి పంచాయతీలో తడి.. పొడి చెత్త సేకరణ,* *పరిశుభ్రతే లక్ష్యంగా ఇంటింటా చెత్త సేకరణ..* *ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గ్రామం దిశగా అడుగులు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 చిట్టమూరు మండలం,* కోగిలి: గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కోగిలి గ్రామ పంచాయతీ పరిధిలో కోగిలి గ్రామం నందు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. *గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి*, తడి చెత్తను ఒకవైపు, పొడి చెత్తను మరోవైపు వేరు చేసి తరలించే విధానాన్ని అమలు చేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. *ఇంటింటికీ చెత్త సేకరణ,* పంచాయతీ పరిధిలోని ఇళ్ల నుంచి పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి కుటుంబం తమ ఇంట్లోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి సిబ్బందికి అందజేయాలని సూచిస్తున్నారు. ఇలా మూలస్థాయిలోనే వ్యర్థాలను వేరు చేయడం వల్ల చెత్త నిర్వహణ సులభతరం కావడంతో పాటు పునర్వినియోగానికి అనువైన వ్యర్థాలను వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. *తడి చెత్తను ప్రత్యేకంగా..* ఇళ్లలో వంటగది నుంచి వెలువడే ఆహార వ్యర్థాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, ఆకులు, పూలు తదితర జీవ వ్యర్థాలను తడి చెత్తగా పరిగణించి ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. ఈ చెత్తను సరైన విధానంలో నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. *పొడి చెత్తను వేరుగా సేకరణ,* ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు, కాగితాలు, అట్టలు, ప్యాకింగ్‌ సామగ్రి, పాత ప్లాస్టిక్‌ వస్తువులు తదితరాలను పొడి చెత్తగా వేరు చేయాలని పంచాయతీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పునర్వినియోగం లేదా రీసైక్లింగ్‌కు అవకాశం ఉన్న పదార్థాలను వేరు చేయడం ద్వారా చెత్త పరిమాణాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. *చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దు,* గ్రామంలోని వీధులు, రహదారుల పక్కన, కాలువల్లో చెత్తను పారవేయకుండా పంచాయతీ సిబ్బందికి అందించాలని అధికారులు సూచిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల,* దుర్వాసన, దోమలు, ఈగలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. చెత్తను క్రమబద్ధంగా సేకరించి తరలించడం ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించవచ్చు. *ప్రజల సహకారం ఎంతో అవసరం,* పంచాయతీ సిబ్బంది మాత్రమే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచలేరని, ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించినప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం ద్వారా పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని సూచిస్తున్నారు. *స్వచ్ఛ గ్రామం దిశగా అడుగులు,* కోగిలి పంచాయతీ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణను నిరంతరం కొనసాగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామ ప్రజలు కూడా పంచాయతీ సిబ్బందికి సహకరిస్తూ చెత్తను వేరు చేసి అందిస్తే పరిశుభ్రత కార్యక్రమం మరింత సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంది. “మన ఇల్లు–మన వీధి–మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి” అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో కోగిలి పంచాయతీని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతోంది.

తిరుపతి

*గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి* *ఆన్‌లైన్ అనుమతులు తీసుకోవాలి,* *పగటిపూటే నిమజ్జనాలు నిర్వహించాలి,* *తూపిలిపాలెం బీచ్‌లో నిమజ్జనాలపై ముందస్తు చర్యలు చేపట్టాలి :* *వాకాడు ఎస్సై నిఖిల్‌బాబు,* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 4 వాకాడు మండలం,* }

*గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి* *ఆన్‌లైన్ అనుమతులు తీసుకోవాలి,* *పగటిపూటే నిమజ్జనాలు నిర్వహించాలి,* *తూపిలిపాలెం బీచ్‌లో నిమజ్జనాలపై ముందస్తు చర్యలు చేపట్టాలి :* *వాకాడు ఎస్సై నిఖిల్‌బాబు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 4 వాకాడు మండలం,* వాకాడు: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాకాడు ఎస్సై నిఖిల్‌బాబు సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన కార్యక్రమం వరకు నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగానే ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని ఎస్సై సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్‌ సౌకర్యం, రహదారి భద్రత, ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, శబ్ద కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పగటిపూటే నిమజ్జనాలు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు పగటిపూటే నిర్వహించాలని ఎస్సై నిఖిల్‌బాబు సూచించారు. నిమజ్జనం కోసం వెళ్లే సమయంలో ఊరేగింపులో క్రమశిక్షణ పాటించాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తూపిలిపాలెం బీచ్‌పై ప్రత్యేక దృష్టి వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం బీచ్‌ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్సై నిఖిల్‌బాబు సూచించారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన సమయంలో ఎవరూ ప్రమాదకరంగా సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు సముద్ర తీరానికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, నిర్వాహకులు పర్యవేక్షించాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో పోలీసుల సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యం గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎస్సై పేర్కొన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించరాదని, రాత్రి వేళల్లో నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. నిర్వాహకులదే కీలక బాధ్యత ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు తమ పరిధిలోని భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సై నిఖిల్‌బాబు సూచించారు. మండపం వద్దకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు, నిమజ్జన సమయంలో యువత అత్యుత్సాహానికి పోకుండా నిర్వాహకులు పర్యవేక్షించాలని తెలిపారు. పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వాకాడు మండలంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు శాఖ చర్యలు చేపడుతుందని ఎస్సై నిఖిల్‌బాబు తెలిపారు.

తిరుపతి

*ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహణే లక్ష్యం,* *మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు,* *డీజేలకు అనుమతి లేదు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే సీజ్‌,* *మండపాల వద్ద జూదం, మత్తు పదార్థాలకు పూర్తిగా నిషేధం,* *నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు చిటమూరు ఎస్సై నాగరాజు,*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 4 చిట్టమూరు మండలం,* }

*ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహణే లక్ష్యం,* *మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు,* *డీజేలకు అనుమతి లేదు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే సీజ్‌,* *మండపాల వద్ద జూదం, మత్తు పదార్థాలకు పూర్తిగా నిషేధం,* *నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు చిటమూరు ఎస్సై నాగరాజు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 4 చిట్టమూరు మండలం,* వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోందని చిట్టమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. వినాయక మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పాటించాల్సిన నిబంధనలను ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్‌ అనుమతి తప్పనిసరి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా సంబంధిత అధికారుల నుంచి ఆన్‌లైన్‌ అనుమతి పొందాలని ఎస్సై స్పష్టం చేశారు. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం, అనుమతికి విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండపానికి ఐదుగురు ఆర్గనైజర్లను తప్పనిసరిగా నియమించుకోవాలని, మండపం వద్ద జరిగే కార్యక్రమాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. డీజేలకు అనుమతి లేదు వినాయక చవితి వేడుకల్లో డీజేలు వినియోగించేందుకు అనుమతి లేదని ఎస్సై నాగరాజు స్పష్టం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు, వృద్ధులకు, విద్యార్థులకు, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. పోలీసుల సూచనలు, నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే సీజ్‌ నిమజ్జనం సందర్భంగా వాహనాలు నడిపే వారు మద్యం సేవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాలను సీజ్‌ చేసి, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమాల్లో యువత అత్యుత్సాహానికి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. జూదం, మత్తు పదార్థాలకు నో వినాయక మండపాల వద్ద జూదం, మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నిషేధం అని ఎస్సై తెలిపారు. భక్తి కార్యక్రమాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం మండపాల వద్ద విద్యుత్‌ వైర్లు, అలంకరణలు, లైటింగ్‌ ఏర్పాటు చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్‌ పరికరాలను వినియోగించాలని, మండపాల వద్ద అగ్నిమాపక భద్రతకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రోడ్లకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయొద్దు ప్రధాన రహదారులు, రాకపోకలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని ఎస్సై నాగరాజు స్పష్టం చేశారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేలా మండపాలు లేదా అలంకరణలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన స్థలంలోనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనంలో ప్రత్యేక జాగ్రత్తలు వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కోరారు. లోతైన చెరువులు, గుంటలు, ప్రమాదకర నీటి ప్రాంతాల్లో నిమజ్జనం చేయకుండా పోలీసు, అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని తెలిపారు. చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు, నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ఊరేగింపులో వాహనాలపై అధిక సంఖ్యలో వ్యక్తులు ప్రయాణించకుండా, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. విగ్రహాల తరలింపు సమయంలో పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసులకు సహకరించాలి వినాయక చవితి పండుగను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషకరంగా నిర్వహించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్సై నాగరాజు పేర్కొన్నారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు, యువత పోలీసు శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. భక్తిశ్రద్ధలు, సామాజిక సౌహార్దం, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై నాగరాజు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

*ఇరువురు పేద వధువులకు మంగళసూత్రములు అందజేత* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 వాకాడు మండలం,* }

*ఇరువురు పేద వధువులకు మంగళసూత్రములు అందజేత* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 వాకాడు మండలం,* తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు, సంస్థ వ్యవస్థాపకులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి,హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద అర్చక,పురోహిత కుటుంబాలకు చెందిన ఇరువురు వధువులకు ఒక లక్ష రూపాయల విలువ చేసే మంగళ సూత్రములు,పసుపు,కుంకుమ,చీర,సారెలకు రొక్కమును ఆలయ ధర్మకర్తలు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదరరెడ్డి ఆన్లైన్ ద్వారా అందించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వైవాహిక క్రతువులో అత్యంత ప్రధానమైన మంగళసూత్రం,పసుపు,కుంకుమ,చీర,సారెలను అర్చక,పురోహిత కుటుంబాలలో పేదలైన వధువులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున ఒక లక్ష రూపాయలను అందించడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి,వంశీ,దినేష్,హరీష్, ఆలయ ప్రధాన అర్చకులు,సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.*

తిరుపతి

*పశుసంరక్షణకు మెరుగైన వసతులు.. కొత్తగుంటలో క్యాటిల్ షెడ్ ప్రారంభం,* *రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు,*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 చిట్టమూరు మండలం,* }

*పశుసంరక్షణకు మెరుగైన వసతులు.. కొత్తగుంటలో క్యాటిల్ షెడ్ ప్రారంభం,* *రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 చిట్టమూరు మండలం,* చిట్టమూరు: మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో పశుపోషణను ప్రోత్సహిస్తూ రైతులకు పశువుల సంరక్షణలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన క్యాటిల్ షెడ్‌ను ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, పశుపోషక రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించవచ్చని నాయకులు పేర్కొన్నారు. కొత్తగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాటిల్ షెడ్‌ను చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గణపర్తి కిషోర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులు పశువులను ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో సంరక్షించుకునేందుకు క్యాటిల్ షెడ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పశువులకు ఎండ, వర్షం వంటి ప్రకృతి పరిస్థితుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వాటి సంరక్షణ, పోషణకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పశుపోషకులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ రైతుల జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పశువుల సంక్షేమం, రైతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలపై నాయకులు, అధికారులతో చర్చించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి ఆరూరు గిరి నాయుడు, వీబీజీ రామ్‌జీ పథకం ఏపీవో, ఈసీ, టీఏ అధికారులు, స్థానిక నాయకులు పల్లం సుధాకర్, పాకాల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై క్యాటిల్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

*పశుసంరక్షణకు మెరుగైన వసతులు.. కొత్తగుంటలో క్యాటిల్ షెడ్ ప్రారంభం,* *రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 చిట్టమూరు మండలం,* }

*పశుసంరక్షణకు మెరుగైన వసతులు.. కొత్తగుంటలో క్యాటిల్ షెడ్ ప్రారంభం,* *రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 చిట్టమూరు మండలం,* చిట్టమూరు: మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో పశుపోషణను ప్రోత్సహిస్తూ రైతులకు పశువుల సంరక్షణలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన క్యాటిల్ షెడ్‌ను ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, పశుపోషక రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించవచ్చని నాయకులు పేర్కొన్నారు. కొత్తగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాటిల్ షెడ్‌ను చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గణపర్తి కిషోర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులు పశువులను ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో సంరక్షించుకునేందుకు క్యాటిల్ షెడ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పశువులకు ఎండ, వర్షం వంటి ప్రకృతి పరిస్థితుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వాటి సంరక్షణ, పోషణకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పశుపోషకులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ రైతుల జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పశువుల సంక్షేమం, రైతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలపై నాయకులు, అధికారులతో చర్చించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి ఆరూరు గిరి నాయుడు, వీబీజీ రామ్‌జీ పథకం ఏపీవో, ఈసీ, టీఏ అధికారులు, స్థానిక నాయకులు పల్లం సుధాకర్, పాకాల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై క్యాటిల్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.