*నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో మెగా కంటి వైద్య శిబిరం.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 9 వాకాడు మండలం,*
వాకాడు పంచాయతీ పరిధిలోని నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో బుధవారం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ప్రారంభించారు.
తిరుపతి వాసన్ ఐ కేర్, కోట రమేష్ ఐ కేర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వంజీవాక రమేష్ కంటి వైద్య శిబిరానికి విచ్చేసిన వారిని కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
అనంతరం కంటిలో శుక్లాలు పొరలు ఉన్నవారిని గుర్తించి వారిని తిరుపతి వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రికి శాస్త్ర చికిత్స నిమిత్తం తరలించారు.
మిగిలిన వారికి కంటి అద్దాలు అందజేస్తామని సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి డాక్టర్ బి.రమేష్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



