బుచ్చి మండలం అన్నారెడ్డిపాలెం పరిసర గ్రామాల్లో గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. నిరంతర విద్యుత్ అందిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యుత్ శాఖ ఎస్‌ఈ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. వ్యవసాయ పనులు, గృహ అవసరాలు కూడా ప్రభావితమవుతున్నాయని, మరమ్మతులు చేపట్టి నిరంతర సరఫరాను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

బుచ్చి పరిసర మూడు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం:ఎస్ ఈ గారు మా ఘోష పట్టించో కొండి