*గిరిజన విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ.* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 28 కోట మండలం,*}
*గిరిజన విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 28 కోట మండలం,* కోట మండలం చెందోడు గిరిజన కాలనీలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. శుక్రవారం రక్షాబంధన్ మరియు సోదరి ఎం భాగ్యలక్ష్మి జన్మదినోత్సవాన్ని పురస్కరించి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, పలకలు పంపిణీ చేయడమే కాక వారికి పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్స్ మరియు ఒకరికొకరు ఒకరు రక్ష అన్నట్లు విద్యార్థిని విద్యార్థులకు రక్షాబంధన్ కార్యక్రమం కూడా నిర్వహించి రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా ముప్పవరపు లీలా మోహన్ కృష్ణకు పలువురు రాఖీలు కట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు,ఎం. వి లవ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అంగనవాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











