Wednesday, 30 September 2026

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూప్ పరీక్షలు,* ,రెండు హైస్కూళ్లలో 250 మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ కార్డుల పంపిణీ,* ,అన్ని మండలాల్లోని పాఠశాలలకు కార్యక్రమాన్ని విస్తరిస్తాం, ,జెవివి గౌరవాధ్యక్షులు గంగపట్నం బాలకృష్ణారెడ్డి,*} *{పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 20 కోట మండలం,* }

*విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూప్ పరీక్షలు,* ,రెండు హైస్కూళ్లలో 250 మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ కార్డుల పంపిణీ,* ,అన్ని మండలాల్లోని పాఠశాలలకు కార్యక్రమాన్ని విస్తరిస్తాం, ,జెవివి గౌరవాధ్యక్షులు గంగపట్నం బాలకృష్ణారెడ్డి,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 20 కోట మండలం,* నెల్లూరు జిల్లా కోట జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో కోట మండలంలోని వంజివాక, గోవిందపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు గంగపట్నం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. బాలకోటేశ్వరరావు, నెల్లూరు హాస్పిటల్ సహకారంతో విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగపట్నం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు పాఠశాలల్లో 250 మంది విద్యార్థినీ, విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని మండలాల్లోని పాఠశాలల్లో ఈ బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డాక్టర్ బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదికను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం మంచి పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజివాక హైస్కూల్ హెడ్‌మాస్టర్ కె. నాగయ్య, గోవిందపల్లి ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు కె. వేణుగోపాల్, కోట మండల జెవివి అధ్యక్షులు పోలాని రాజేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు ఎ. శంకర్, హాస్పిటల్ సిబ్బంది, టెక్నీషియన్లు లోకేశ్వరి, స్వరూప, అఖిల, స్రవంతి, సుచరిత, ఏఎన్‌ఎం గౌతమి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన జన విజ్ఞాన వేదిక కోట మండల శాఖకు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.

తిరుపతి

{*సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, అశోక్ పిల్లర్ వాకాడు,*} { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,* }

*సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, అశోక్ పిల్లర్ వాకాడు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,* వాకాడు: బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు పెంచినందుకు బుధవారం సాయంత్రం వాకాడలో టిడిపి ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అశోక పిల్లర్ సెంటర్ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టిడిపి నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టిడిపి నాయకులు నీటి సంఘ అధ్యక్షులు సీనా రెడ్డి, బత్తిన ప్రమీల, సురేష్ , వేము దినకర బాబు, గోపి నాయుడు, షేక్ రహమతుల్లా, కావలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం* *నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం* *మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,* }

*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం* *నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం* *మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,* నెల్లూరు జిల్లా కోట పంచాయతీ కార్యాలయానికి అతి సమీపంలో, అంగన్వాడీ కేంద్రం దగ్గర పైప్‌లైన్ పగిలి సుమారు 20 రోజులుగా నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మార్గంలో మట్టి టిప్పర్లు భారీ లోడుతో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పైప్‌లైన్ నుంచి నీరు లీకై రోడ్డుపై ఉన్న వ్యర్థాలతో కలిసి మురికిగా మారి కలుషితమవుతోంది. తాగునీరు వృథా అవుతుండటంతో పాటు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

*సచివాలయము తనిఖీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*

*సచివాలయము తనిఖీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,* తిరుపతి జిల్లావాకాడు మండలం సచివాలయ ఇంచార్జి అధికారి, నెల్లిపూడి స్పెషల్ ఆఫీసర్ శ్రీ సీ. శ్రీనివాసులు బుధవారం నెల్లిపూడి సచివాలయమును తనిఖీ చేసి, సచివాలయ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది ని ఉద్దేశించి మాట్లాడుతూ సచివాలయం లో ఉన్న సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఉదయం 10.30 లోపు బయోమెట్రిక్ వేసి విధులు పట్ల బాధ్యత తో పని చేయాలని,అలాగే సచివాలయమునకు వచ్చే ప్రజల పట్ల గౌరవ పూర్వకంగా వ్యవహరించాలి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా నెల్లిపూడి లో ఇటీవల ఏర్పాటు చేసిన లేఔట్ విషయం పై పంచాయతీ కార్యదర్శి హుస్సేన్ బాషా తో చర్చించగా పంచాయతీ రికార్డు ప్రకారం ప్రస్తుతం పంచాయతీ అనుమతులు , తదితర విషయాలపై లేఔట్ యజమానికి నోటీసు ఇవ్వడం జరిగింది అని, ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు లేఔట్ పై తగిన చర్యలు తీసుకొనవలసినదిగా ఆయన పంచాయతీ కార్యదర్శిని కోరారు.

తిరుపతి

*అంగన్వాడి చిన్నారులకు విద్యాసామాగ్రి పంపిణీ.* *గిరిజన చిన్నారుల కోసం ఎమ్మి రావు ఫౌండేషన్ చేయూత.* ( *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ వాకాడు మండలం,*)

మండల కేంద్రమైన వాకాడులోని గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని 15 మంది చిన్నారులకు వారికి అవసరమైన విద్యాసామాగ్రిని కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి.రావు ఫౌండేషన్ విద్యా సామాగ్రిని చేయూత క్రింద పంపిణీ చేశారు. వాకాడు తాలూకా ఖజానా అధికారి రవీంద్రనాథ్ చేతుల మీదుగా విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. ఎంవి రావు ఫౌండేషన్ గత 19 సంవత్సరాలుగా అనునిత్యం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ క్రమంలో వాకాడు గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యనభ్యసించే చిన్నారులకు చేయూత కింద వారికి అవసరమైన పలక బలపం చాపలను అంగన్వాడీ కేంద్రం టీచర్ ఆధ్వర్యంలో ఉప ఖజానా అధికారి రవీంద్రనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ మా ఫౌండేషన్ నేటికీ 11703 సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువైoదఅన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి ఉపగజానాధికారి రవీంద్రనాథ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

గూడూరులో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 17 గూడూరు,*

గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ ఆవరణలో *వెరిటాస్ జూనియర్ కాలేజీ* ఆవరణలో సోమవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత *స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం* ఏర్పాటు చేసిన *ఎం.వి. రావు ఫౌండేషన్* ఆధ్వర్యంలో *ఉచిత నేత్ర వైద్య శిబిరం* నిర్వహించారు. వెరిటాస్ జూనియర్ కళాశాల చైర్మన్ మరియు కరస్పాండెంట్ నాదెండ్ల హరిబాబు, సుకుమార్ నాయుడు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేసారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ ఇతర ప్రాంతాల నుంచి కంటి సమస్యలతో బాధపడే వారు ఈ శిబిరానికి హాజరయ్యారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యుడు డాక్టర్ వి .రమేష్ బాబు నేత్ర సమస్యలతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా 11701 కార్యక్రమంగా నిర్వహించారు. గూడూరు పట్టణం నుంచి వందల మంది ఈ శిబిరానికి హాజరై నేత్ర సమస్యలను చూపించుకున్నారు. దృష్టిలోపం ఉన్న వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు పంపిణీ చేయనున్నామని, కంటిలో శుక్లాలు ఇతర సమస్యలతో బాధపడేవారికి తిరుపతి పట్టణానికి చెందిన వాసన ఐ కేర్ లో శస్త్ర చికిత్సలు చేయించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వనున్నామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, డాక్టర్ సుగుణమ్మ, ప్రిన్సిపాల్ దొగ్గోలు బాబు రెడ్డి, కోలా మీరయ్య నాయుడు అంగన్వాడి టీచర్ ఎం షాజీదా కళాశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు గూడూరు పట్టణ వాసులు పాల్గొన్నారు.

తిరుపతి

*మల్లాం గ్రామంలో శేషురెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 16 చిట్టమూరు మండలం,* మల్లాం: మల్లాం పంచాయతీ పరిధిలోని మల్లం గ్రామంలో ప్రముఖుడు శేషురెడ్డి జన్మదిన వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై శేషురెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లాం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు సాయి రెడ్డి పాల్గొని శేషురెడ్డికి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. శేషురెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు, గ్రామ పెద్దలు, యువత, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిల్లకూరు సాయి రెడ్డి మాట్లాడుతూ శేషురెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్తులు, అభిమానులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు సంతోషోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి. పాల్గొన్న గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

*దృష్టిలోపాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నాం.* *చిరంజీవి ముప్పవరపు వెంకట రవి కిరణ్ జన్మదినోత్సవ సందర్భంగా….*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 16 చిట్టమూరు మండలం,* దృష్టిలోపాన్ని అరికట్టేందుకు మా వంతు సహకారం కృషి చేస్తున్నామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు. ఆదివారం చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దృష్టిలో ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇటీవల కోట మండలం గూడలి, వాకాడు మండలం కొండాపురం, కోట మండలం గూడలి గ్రామాలలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న 35 మందిని గుర్తించారు. చిరంజీవి ముప్పువరపు వెంకట రవి కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయా గ్రామాల్లో దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మూడు గ్రామాల్లో నేత్ర వైద్య శిబిరాలు ద్వారా కంటి శుక్లాలు ఉన్నవారికి కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలను ఎంవి రావు ఫౌండేషన్ వారు కోట రమేష్ ఐ కేర్ నేతృత్వంలో కంటి అద్దాలు, వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటిలో శుక్లాల ఆపరేషన్లు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వెంకట రవి కిరణ్ కు ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.

తిరుపతి

*ఉపాధి కూలీలతో ఘనంగ సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్న అధికారులు, నాయకులు,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,* (కోగిలి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోగిలి పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రషీద్ భాయ్, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను వివరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో అనేకమంది తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని తెలిపారు. దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. జాతీయ సమైక్యత, సోదరభావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై కూడా కూలీలకు అవగాహన కల్పించారు. “పచ్చని చెట్లు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి” అంటూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉపాధి కూలీల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని మరింత పెంపొందించింది. కార్యక్రమంలో ఉపాధి కూలీలు, సిబ్బంది, స్థానిక నాయకులు టిడిపి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ భాయ్, టిడిపి సీనియర్ మాజీ ఎంపీటీసీ ముజ్మీర్, టిడిపి సీనియర్ నాయకులు కమతం వెంకటేశ్వర్లు వేమ గుంట పాలెం,టిడిపి యువ నాయకులు ఖలీల్ భాషా, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్, వీరాస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కమతం చెంగయ్య,బల్లి ఉదయ్, మరియు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

తిరుపతి

*80 అడుగుల జెండాతో దేశభక్తి ర్యాలీ* *కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,* మండల కేంద్రంలోని కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్‌ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. దేశం పట్ల గౌరవం, భక్తి, బాధ్యతతో మెలగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలు దేశ సమగ్రత, అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తదితర జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం 80 అడుగుల భారీ జాతీయ జెండాతో కొత్తగుంటలో విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ రహమంతుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.