Wednesday, 30 September 2026

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* *ముఖ్యఅతిథిగా హాజరైన వాకాడు సీఐ*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,* చిట్టమూరు పోలీస్ స్టేషన్‌ ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి జనగణమన ఆలపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత చక్కగా చదువుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం చిట్టమూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.

తిరుపతి

*విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.* *వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు, ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,* ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ.

*విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.* *వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు, ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,* ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 కోట మండలం,* స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు విద్యా ప్రదాత అని, నిత్య కృషివలుడని, మహోన్నత ఉద్యమ దాతని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఐ వి రమణయ్య అన్నారు. కోట మండలం చెందోడు పంచాయతీ పరిధిలోని ఎన్ టి ఆర్ గిరిజన కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలోని 35 మంది చిన్నారులకు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు 85 వ జయంతిని పురస్కరించుకుని ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్ టి ఆర్ కాలనీ వాసుల సమక్షంలో వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జన్మ దినోత్సవ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవీ రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు పాల వ్యాపారం చేస్తూ విద్యనభ్యసించారని అనంతరం బాపట్లలో టిటిసి చేసి ఒంగోలు పట్టణానికి చెందిన ఆదిలక్ష్మి వివాహం చేసుకొని నెల్లూరు జిల్లా కోట సమితిలోని పాలిచర్ల వారి పాలెం లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు అన్నారు. వారి సతీమణి ఆదిలక్ష్మి సహకారంతో పగలు ఉద్యోగ వృత్తి చేస్తూ రాత్రి వేళల్లో ఉన్నచ చదువులు చదివి ఎం ఏ ఎం ఎడ్ పూర్థి చేశారని ఆయన కేవలం పాలిచర్ల వారి పాలెం మోమిడి చిట్టేడు, కుక్కుపాడు పాఠశాలల్లో పనిచేసే తాను చదివిన చదువుకు ఆఖరి దశలో కలువాయి మండలం కుల్లూరు జూనియర్ కళాశాలలో 2000 సంవత్సరంలో అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారన్నారు.అనంతరం విద్యానగర్లో శ్రీ విద్యా వికాస్ పాఠశాల ను ప్రారంభించి పేదల నిరుపేదల ఆశాజ్యోతి గా విద్యాదాతగా పేరుని ఆర్జించారని అదేవిధంగా ఎన్.బి.కె.ఆర్ బీఈడీ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసే 2008 సంవత్సరంలో గుండెపోటుతో చివర శ్వాస తీసుకున్నారన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు పేరిట ఎం వి రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం దాతల సహకారం లేకుండా స్వతంత్రంగా వారి సొంత నిధులతోనే నేటికీ 11700 కార్యక్రమాలు పూర్తి చేసిన ఘనత ఎంవి రావు ఫౌండేషన్ కే దక్కుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీ ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గిరిజన కాలనీలోని నిరుపేదలైన గిరిజనులకు స్థానిక ప్రాథమిక అంగన్వాడీ కేంద్రాలలో విద్యనభ్యసించే 35 మంది చిన్నారులకు అవసరమైన నోట్స్లు పలకలు , బలపాలు పంపిణీ చేసి వారి పుట్టినరోజు పరిష్కరించుకొని గ్రామస్తులకు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులు అందరు కలిసి వెంకటేశ్వరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఐ వి రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు అంగన్వాడీ టీచర్ భారతి గ్రామస్తులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుపతి

*దృష్టిలోపాన్ని పూర్తిగా అరికట్టాలి.* *45 మందికి కంటి అద్దాలు పంపిణీ.*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 13 వాకాడు మండలం,* ప్రతి ఒక్కరిలో ఉన్న దృష్టిలోపాన్ని అరికట్టడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు. గురువారం వాకాడు మండలం కొండాపురం వడ్డీ పాలెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ద్వారా దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోని కొండాపురం వడ్డీ పాలెం, చిట్టేడు గుణపాడు గ్రామాల్లో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన దృష్టిలోపం ఉన్న కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినిత్యం కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వారికి కంటి అద్దాలు అందజేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేస్తున్నామని ఆ క్రమంలో మూడు గ్రామాల్లో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాలు దృష్టిలోపం ఉన్న 45 మందికి నేత్ర వైద్య నిపుణులు బి రమేష్ కంటి పరీక్షలు నిర్వహించి వారికి కంటి అద్దాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అధ్యక్షుల ముప్పవరపు లీలామోహన్ కృష్ణ గ్రామస్తులు దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.