Sunday, 16 August 2026
  • Home  
  • *విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.* *వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు, ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,* ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ.
- తిరుపతి

*విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.* *వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు, ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,* ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ.

*విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.* *వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు, ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,* ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ. *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 కోట మండలం,* స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు విద్యా ప్రదాత అని, నిత్య కృషివలుడని, మహోన్నత ఉద్యమ దాతని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఐ వి రమణయ్య అన్నారు. కోట మండలం చెందోడు పంచాయతీ పరిధిలోని ఎన్ టి ఆర్ గిరిజన కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలోని 35 మంది చిన్నారులకు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు 85 వ జయంతిని పురస్కరించుకుని ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్ టి ఆర్ కాలనీ వాసుల సమక్షంలో వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జన్మ దినోత్సవ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవీ రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు పాల వ్యాపారం చేస్తూ విద్యనభ్యసించారని అనంతరం బాపట్లలో టిటిసి చేసి ఒంగోలు పట్టణానికి చెందిన ఆదిలక్ష్మి వివాహం చేసుకొని నెల్లూరు జిల్లా కోట సమితిలోని పాలిచర్ల వారి పాలెం లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు అన్నారు. వారి సతీమణి ఆదిలక్ష్మి సహకారంతో పగలు ఉద్యోగ వృత్తి చేస్తూ రాత్రి వేళల్లో ఉన్నచ చదువులు చదివి ఎం ఏ ఎం ఎడ్ పూర్థి చేశారని ఆయన కేవలం పాలిచర్ల వారి పాలెం మోమిడి చిట్టేడు, కుక్కుపాడు పాఠశాలల్లో పనిచేసే తాను చదివిన చదువుకు ఆఖరి దశలో కలువాయి మండలం కుల్లూరు జూనియర్ కళాశాలలో 2000 సంవత్సరంలో అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారన్నారు.అనంతరం విద్యానగర్లో శ్రీ విద్యా వికాస్ పాఠశాల ను ప్రారంభించి పేదల నిరుపేదల ఆశాజ్యోతి గా విద్యాదాతగా పేరుని ఆర్జించారని అదేవిధంగా ఎన్.బి.కె.ఆర్ బీఈడీ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసే 2008 సంవత్సరంలో గుండెపోటుతో చివర శ్వాస తీసుకున్నారన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు పేరిట ఎం వి రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం దాతల సహకారం లేకుండా స్వతంత్రంగా వారి సొంత నిధులతోనే నేటికీ 11700 కార్యక్రమాలు పూర్తి చేసిన ఘనత ఎంవి రావు ఫౌండేషన్ కే దక్కుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీ ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గిరిజన కాలనీలోని నిరుపేదలైన గిరిజనులకు స్థానిక ప్రాథమిక అంగన్వాడీ కేంద్రాలలో విద్యనభ్యసించే 35 మంది చిన్నారులకు అవసరమైన నోట్స్లు పలకలు , బలపాలు పంపిణీ చేసి వారి పుట్టినరోజు పరిష్కరించుకొని గ్రామస్తులకు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులు అందరు కలిసి వెంకటేశ్వరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఐ వి రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు అంగన్వాడీ టీచర్ భారతి గ్రామస్తులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*విద్యాప్రదాతకు చిన్నారుల నీరాజనాలు.*

*వెంకటేశ్వరరావు నిత్య కృషివలుడు,
ఎం వి రావు 85 వ జన్మదిన దినోత్సవ సంబరాలు,*

ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి ఆర్ గిరిజన కాలనీ లోని 35 మంది చిన్నారులకు స్వీట్స్ విద్యా సామాగ్రి పంపిణీ.

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 కోట మండలం,*

స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు విద్యా ప్రదాత అని, నిత్య కృషివలుడని, మహోన్నత ఉద్యమ దాతని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఐ వి రమణయ్య అన్నారు.

కోట మండలం చెందోడు పంచాయతీ పరిధిలోని ఎన్ టి ఆర్ గిరిజన కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలోని 35 మంది చిన్నారులకు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు 85 వ జయంతిని పురస్కరించుకుని ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్ టి ఆర్ కాలనీ వాసుల సమక్షంలో వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జన్మ దినోత్సవ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐవీ రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు పాల వ్యాపారం చేస్తూ విద్యనభ్యసించారని అనంతరం బాపట్లలో టిటిసి చేసి ఒంగోలు పట్టణానికి చెందిన ఆదిలక్ష్మి వివాహం చేసుకొని నెల్లూరు జిల్లా కోట సమితిలోని పాలిచర్ల వారి పాలెం లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు అన్నారు.
వారి సతీమణి ఆదిలక్ష్మి సహకారంతో పగలు ఉద్యోగ వృత్తి చేస్తూ రాత్రి వేళల్లో ఉన్నచ చదువులు చదివి ఎం ఏ ఎం ఎడ్ పూర్థి చేశారని ఆయన కేవలం పాలిచర్ల వారి పాలెం మోమిడి చిట్టేడు, కుక్కుపాడు పాఠశాలల్లో పనిచేసే తాను చదివిన చదువుకు ఆఖరి దశలో కలువాయి మండలం
కుల్లూరు జూనియర్ కళాశాలలో 2000 సంవత్సరంలో అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారన్నారు.అనంతరం విద్యానగర్లో శ్రీ విద్యా వికాస్ పాఠశాల ను ప్రారంభించి పేదల నిరుపేదల ఆశాజ్యోతి గా విద్యాదాతగా పేరుని ఆర్జించారని అదేవిధంగా ఎన్.బి.కె.ఆర్ బీఈడీ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసే 2008 సంవత్సరంలో గుండెపోటుతో చివర శ్వాస తీసుకున్నారన్నారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు పేరిట ఎం వి రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం దాతల సహకారం లేకుండా స్వతంత్రంగా వారి సొంత నిధులతోనే నేటికీ 11700 కార్యక్రమాలు పూర్తి చేసిన ఘనత ఎంవి రావు ఫౌండేషన్ కే దక్కుతుందన్నారు.
ఆగస్టు 15వ తేదీ ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గిరిజన కాలనీలోని నిరుపేదలైన గిరిజనులకు స్థానిక ప్రాథమిక అంగన్వాడీ కేంద్రాలలో విద్యనభ్యసించే 35 మంది చిన్నారులకు అవసరమైన నోట్స్లు పలకలు , బలపాలు పంపిణీ చేసి వారి పుట్టినరోజు పరిష్కరించుకొని గ్రామస్తులకు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులు అందరు కలిసి వెంకటేశ్వరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఐ వి రమణయ్య ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు అంగన్వాడీ టీచర్ భారతి గ్రామస్తులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.