Sunday, 16 August 2026
  • Home  
  • దుత్తలూరు విశ్వతేజలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు విశ్వతేజలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

దుత్తలూరు మండలంలోని విశ్వతేజ విద్యాసంస్థలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత మేకపాటి అభినవ్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేకపాటి అభినవ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.