*గుణపాడు గిరిజన కాలనీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం,*
(గుణ పాడు)
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 25 చిట్టమూరు మండలం,*
గుణపాడు గిరిజన కాలనీలో మంగళవారం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ గుణపాడు గిరిజన కాలనీలోని అన్ని కుటుంబాల వారికి కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేతృత్వంలో కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
ఎం వి రావు ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరంలో గిరిజన కాలనీలోని ప్రతి ఒక్కరికి దృష్టిలోపాన్ని అరికట్టేందుకు ఈ నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి సమస్యలు కంటిలో శుక్లాలు ఉన్నవారిని గుర్తించి కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు, కంటిలో శుక్లాలు ఉన్న వారికి తిరుపతి వాసన ఐ కేర్ కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
స్థానిక అంగనవాడి కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి గిరిజన కాలనీవాసులు అత్యధికంగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది కవిత పాల్గొన్నారు.గిరిజన కాలనీవాసులు పాల్గొని కంటి సమస్యలకు అవసరమైన చికిత్సలు చేయించుకున్నారు.



