*కోటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,*
*నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని అల్లారెడ్డి వెంకటకృష్ణా రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, వివిధ ఆటపాటలతో విద్యార్థులను విశేషంగా అలరించారు. గురువుల ప్రదర్శనలు పిల్లల్లో నవ్వులు పూయించాయి. అనంతరం ఉపాధ్యాయులకు నిర్వహించిన షాట్‌పుట్ తదితర క్రీడా పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటారు. విద్యార్థులు తమ ప్రియతమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం డి.కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే గురువుల ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.*



