*జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు దంపతులకు ఘన సన్మానం*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 వాకాడు మండలం,*
తిరుపతి జిల్లా. వాకాడు: మండల పరిధిలోని గద్దలమెట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రేచల్ కిజియా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై, ఈరోజు గురుపూజోత్సవ సందర్భంగా తిరుపతిలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఆ ఉపాధ్యాయురాలను ఈరోజు సాయంత్రం వాకాడు మండలం విద్యాశాఖ తరఫున ఎంఈఓ నసీం ఆలీ, ప్రధానోపాధ్యాయుడు పిడుగు ప్రవీణ్ ,ఇతరు ఉపాధ్యాయులు ఉత్తమ వార్డు గ్రహీతను, ఆమె భర్త ప్రభు చరణ్ ను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.



