Saturday, 15 August 2026
  • Home  
  • అయ్యప్ప స్వామి ఆలయ కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

అయ్యప్ప స్వామి ఆలయ కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 14, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నంది హిల్స్ పరిధిలో నూతనంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ కుంభాభిషేకం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన గోడపత్రికను (పాంప్లెట్) శుక్రవారం నాడు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప స్వామి తత్వమసి సేవా సమితి కమిటీ (SASVTSS 74/2026) ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వివరించారు. పవిత్రమైన ఈ విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరుతూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఆయన ధర్మపత్ని రిషితమ్మను కమిటీ సభ్యులు సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంది హిల్స్ వద్ద అయ్యప్ప స్వామి ఆలయం నిర్మితమవ్వడం సంతోషకరమని, ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను నియోజకవర్గ భక్తులు భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ విశిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో తత్వమసి సేవా సమితి కమిటీ ముఖ్య నిర్వాహకులు, సభ్యులు, ఆలయ గురుస్వాములు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.