*అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన అన్నమేటి బాలసుబ్రమణ్యం,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,*
అమరావతి: వాకాడు గ్రామానికి చెందిన టీడీపీ ఎన్ఆర్ఐ జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత అన్నమేటి బాలసుబ్రమణ్యం మంగళవారం అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యంతో పాటు టీడీపీ ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు కూడా మంత్రిని కలిసి పలు అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు.
ఈ భేటీలో రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సహకారం అందించాల్సిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లోని తెలుగు ప్రజలు, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అందించగల సహకారంపై కూడా చర్చించినట్లు సమాచారం. విద్యా, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్‌లో మరింత సమన్వయంతో పనిచేస్తామని బాలసుబ్రమణ్యం తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను కలవడం సంతోషంగా ఉందని అన్నమేటి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. భేటీ అనంతరం టీడీపీ ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు మంత్రితో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.



