Thursday, 3 September 2026
  • Home  
  • నవోదయ ప్రవేశ పరీక్షపై మెగా మోడల్‌ టెస్ట్‌
- BHADRADRI

నవోదయ ప్రవేశ పరీక్షపై మెగా మోడల్‌ టెస్ట్‌

సారపాక: జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2027-28కు సంబంధించి నూతన సిలబస్‌ విధానంపై జిల్లా స్థాయి మెగా మోడల్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు సారపాక బ్రిలియంట్‌ నవోదయ కోచింగ్‌ డైరెక్టర్‌ డా. బి.ఎన్‌.ఆర్. తెలిపారు. జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి ఈ ఏడాది సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు కొత్త సిలబస్‌, పరీక్షా విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిలియంట్‌ విద్యాసంస్థల్లో సెప్టెంబర్‌ 6న ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. మెంటల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంట్‌, మ్యాథ్స్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌లకు తగిన మార్కులు కేటాయించనున్నట్లు తెలిపారు. పరీక్షను OMR విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సారపాక: జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2027-28కు సంబంధించి నూతన సిలబస్‌ విధానంపై జిల్లా స్థాయి మెగా మోడల్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు సారపాక బ్రిలియంట్‌ నవోదయ కోచింగ్‌ డైరెక్టర్‌ డా. బి.ఎన్‌.ఆర్. తెలిపారు. జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి ఈ ఏడాది సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు కొత్త సిలబస్‌, పరీక్షా విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రిలియంట్‌ విద్యాసంస్థల్లో సెప్టెంబర్‌ 6న ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. మెంటల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంట్‌, మ్యాథ్స్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌లకు తగిన మార్కులు కేటాయించనున్నట్లు తెలిపారు. పరీక్షను OMR విధానంలో నిర్వహించనున్నారు.
పరీక్షలో ప్రతిభ కనబరిచి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.