పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ జూలై 29
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. పౌర్ణమి గరుడ సేవలో భాగంగా స్వామి వారిని దర్శించేందుకు భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చారు. గరుడునిపై కొలువైన స్వామి వారిని దర్శించిన భక్తులు కర్పూర హారతులతో తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలోని ప్రధాన వీధుల్లో గరుడవాహన దారుడైన శ్రీనివాసునికి భక్తులు నైవేద్యం, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



