Wednesday, 2 September 2026

Tag: Punnami News

పల్నాడు

*పల్నాడు జిల్లాలో స్కూల్ బస్సు ను వెనుకనుండి ఢీకొట్టిన లారీ పలువురు విద్యార్థులకు గాయాలు*

పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పల్నాడు

*పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు….*

పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…. జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన భారీ ఏర్పాట్లు… ఇస్సప్పాలెంలో మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టిన ఇంచార్జ్ జిలాని… ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ… అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి,అన్నదానం ఏర్పాటు చేసిన జిలాని… కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ,జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

పల్నాడు

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!* *నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన శ్రేణుల ఘన స్వాగతం.* *మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు.* *SRK సెంటర్‌లో డప్పులు, డీజేలు, నినాదాలతో హోరెత్తిన పసుపు సైనికులు, అభిమానులు.* *పసుపు జెండాలతో, గజమాలలతో యువనేత లోకేష్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, అభిమానులు.* Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.