Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Political

నంద్యాల

అన్నదాతపై అక్రమ కేసులా? భేషరతుగా ఎత్తివేయాలి: నంది రైతు సమాఖ్య

సాగు, తాగునీరు విడుదల చేయాలని కోరడానికి కలెక్టరేట్‌కు వెళ్లిన రైతులు, మాజీ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ‘నంది రైతు సమాఖ్య’ తీవ్రంగా ఖండించింది. శ్రీశైలంలో 175 టీఎంసీల నీరున్నా దిగువకు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి పశువులకు, ప్రజలకు తాగునీరు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అడ్డుకుని, రోడ్డుపై కూర్చున్న 35 మందిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు నీటిని విడుదల చేయాలని, రైతులపై బనాయించిన కేసులను ప్రభుత్వం, కలెక్టర్ భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమాఖ్య నాయకులు రామ సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

NMD ఫిరోజ్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు

నంద్యాల: రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్ తనయుడు, టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ జన్మదిన వేడుకలు రేపు ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫిరోజ్‌కు నంద్యాల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Date. 02.08.2026 దుత్తలూరు (పున్నమి ప్రతినిధి ) ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉదయగిరిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు వివిధ మండలాల జనసేన మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఉదయగిరిలో జనసేన శ్రేణుల సందడి నెలకొంది. Uploaded Video:

నంద్యాల

రేపు నంద్యాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: సర్వం సిద్ధం

నంద్యాల:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సందేశంతో పాటు, పార్టీ యువజన విభాగం విధి విధానాలపై ప్రత్యేక లైవ్ స్ట్రీమింగ్ ప్రదర్శన నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, రాంబాబు స్థానికంగా ఏర్పాట్లను ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు. జనసైనికులు, వీరమహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.

నంద్యాల

నంద్యాలలో వైసీపీ ‘చలో కలెక్టరేట్’ సక్సెస్: 2-3 రోజుల్లో నీళ్లిస్తామని కలెక్టర్ హామీ

నంద్యాల:సాగు, తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “చలో కలెక్టరేట్” ఆందోళన మహోద్యమంగా మారింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నేతృత్వంలో గురువారం వందలాది మంది రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ను ముట్టడించారు.శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు బీళ్లువారి రైతులు కంటతడి పెడుతున్నారని శిల్పా రవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే చెరువులు ఎండిపోయి తాగునీటి ఎద్దడి తలెత్తిందని, పంటల భీమా కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.అనంతరం ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఇతర నేతలతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ రెండు లేదా మూడు రోజుల్లో సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

నంద్యాల

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: మంత్రి ఫరూక్‌కు రజక సంఘాల వినతి

నంద్యాల :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రజక సంఘాల నాయకులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల

మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యులు మౌలానా

నంద్యాల :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమితులైన మౌలానా మహమ్మద్ హుస్సేన్ అహ్మద్.. నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో (జీవో.ఆర్.టీ.నెం. 107) ప్రకారం నియామక ఉత్తర్వులు అందుకోవడంతో, మంత్రికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రభుత్వానికి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన సభ్యుడికి మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలుపుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వివాదాల పరిష్కారంలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ మైనార్టీల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ సుబ్లి, కర్నూల్ గవర్నమెంట్ కాజీ సలాం మౌలానా, పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు

నంద్యాల

మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్

నంద్యాల పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను స్థానిక జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ మరియు రాంబాబు మంత్రిని కలిసి దుశ్శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహం తదితర అంశాలపై నాయకులు మంత్రితో పలు విషయాలను చర్చించారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల

పోలీస్ ఆంక్షలతో వైకాపా పోరాటాన్ని ఆపలేరు వెలుగోడు రిజర్వాయర్ నిరసనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ధ్వజం

నంద్యాల:రైతాంగ సమస్యలు, తాగు, సాగునీటి విడుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు కూటమి ప్రభుత్వం భయపడుతోందని నంద్యాల జిల్లా వైసపి అధ్యక్షులు, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు, వైకాపా శ్రేణులు తరలిరాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.పోలీస్ నోటీసులు, బెదిరింపులపై ఆగ్రహంకార్యక్రమానికి ట్రాక్టర్లు ఇవ్వకూడదని వైకాపా నాయకులు, రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనకు ట్రాక్టర్లతో వస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. రైతుల కోసం చేసే పోరాటాలను ఆంక్షలతో అణచివేయలేరని, జెండాలు, అజెండాలు పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రైతుల కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు

నంద్యాల

జూలేపల్లెలో ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్

గోస్పాడు/జూలేపల్లె: గ్రామీణ ప్రజల ముంగిట్లోనే మెరుగైన ప్రాథమిక ఉచిత వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్’ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణులు చిన్న చిన్న వ్యాధులు, పరీక్షల కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోనే మందులు, గర్భిణులకు పరీక్షలు, ప్రాథమిక చికిత్స అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చిస్తోందన్నారు. కార్యక్రమంలో దీబగుంట్ల సొసైటీ చైర్మన్ నలిపెల ఓబులరెడ్డి, కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.