నంద్యాల పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను స్థానిక జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ మరియు రాంబాబు మంత్రిని కలిసి దుశ్శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహం తదితర అంశాలపై నాయకులు మంత్రితో పలు విషయాలను చర్చించారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్