Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Political

నంద్యాల

చర్చికి ₹1 లక్ష ఆర్థిక సాయం అందించిన గోళ్ళ రాజేష్

నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో ఉన్న అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థన మందిరాన్ని (చర్చ్) వైఎస్సార్ నగర్ టీడీపీ ఇన్‌చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు ఆహ్వానం మేరకు నాయకుడు గోళ్ళ రాజేష్ సందర్శించారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం బాడీ ఫ్రీజర్ కొనుగోలుకు, క్రిస్టియన్ల స్మశాన వాటిక (బరిగెల్ గ్రౌండ్) ఫెన్సింగ్ గోడ నిర్మాణం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహకార చెక్కును ఆయన పాస్టర్లకు అందజేశారు.గడిచిన 16 ఏళ్లలో తమ చర్చికి ఆర్థిక సాయం అందించిన ఏకైక వ్యక్తి గోళ్ళ రాజేష్ మాత్రమేనని, ఆయన సేవలను కొనియాడుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పేదలకు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని గోళ్ళ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవసేవకులు డి.పాల్ జోసఫ్, బాలరాజు, కాలేబు, జయరాజు, ఇజ్రాయిల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎన్ఎండి ఫయాజ్

నంద్యాల :ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ పరిధిలో మాజీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై తక్షణమే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నంద్యాలలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారని ఫయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బింగుమల్లా శ్యామసుందర్ గుప్తా, చింతల కుమార్, చంద్రమౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోషిత రెడ్డి వివాహ వేడుకలో పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు

కావలిజమ్మలపాలెంలోని కె.వి.ఆర్. కన్వెన్షన్‌లో జరిగిన కలిగిరి మాజీ మండల అధ్యక్షులు, కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ మెట్టుకూరు రామిరెడ్డి, శ్రీమతి భారతమ్మ దంపతుల మనుమరాలు సౌ. జోషిత రెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియలకు హాజరైన బొల్లినేని వెంకట రామారావు

గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు కావలి పట్టణ ప్రముఖులు, ద్వారకా లాడ్జి అధినేత గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకటరామారావు గారు గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు.

కాకినాడ

రైఫిల్ ఇన్‌స్టిట్యూట్ పెడుతున్నానని చెప్పి నన్ను సాదిక్ ఖాన్ ఆహ్వానిస్తే వెళ్లాను.మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైఫిల్ ఇన్‌స్టిట్యూట్ పెడుతున్నానని చెప్పి నన్ను సాదిక్ ఖాన్ ఆహ్వానిస్తే వెళ్లాను. నాతో పాటు అప్పట్లో నాయకులు, అధికారులు కూడా వచ్చారు. ఆరోజు నాకు శాలువా కప్పిన సాదిక్ ఖాన్ ఫోటో దిగాడు. ఆ ఫోటోని పట్టుకుని.. నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. కాకినాడలో అతని దందాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. — ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే Uploaded Video:

నంద్యాల

మంత్రి ఫరూక్‌తో ఎంపీ బైరెడ్డి శబరి భేటీ

నంద్యాల:రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

నంద్యాల

కొత్తపల్లి సుధాకర్ రెడ్డి అన్న కూతురి వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు

కొత్తపల్లి సుధాకర్ రెడ్డి అన్న కూతురి వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ యువ నాయకుడు, అడ్వకేట్ శ్రీ మనీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

కర్నూలు

ప్రతి ఇంటికి తెలుగుదేశం :-కున్నూర్ గ్రామ అధ్యక్షులు రమణ చౌదరి

గోనెగండ్ల: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి సూచనలు, ఆదేశాలతో గోనెగండ్ల మండలం కున్నూర్ “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడమే “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జి బాషా , బూత్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. “ప్రతి ఇంటికి తెలుగుదేశం – ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి” అనే నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

కాకినాడ

ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసిపి అండగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు ఆపి, సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జమ్మలమడక నాగమణి

కాకినాడ.ఆగస్ట్ 22 : కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని లేదా కూటమి నాయకులను ఏ విషయంలోనైనా ప్రశ్నిస్తే “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, సస్పెన్షన్లతో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాల్లో చేరే నాటికి లేని టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని (కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన టీచర్లు) అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న లక్షలాది మంది సీనియర్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే వారు చేసిన నేరమా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఐఆర్, మెరుగైన పిఆర్సి , అమలు చేయకపోగా, పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు దాదాపు రూ. 35,000 కోట్ల నుండి రూ. 40,000 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ధ్వజమెత్తారు.తమ న్యాయమైన హక్కులు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా నిలిచి, వారి పోరాటానికి మద్దతుగా న్యాయపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసీపీ అండగా ఉంటుందని జమ్మలమడక నాగమణి అన్నారు.

కాకినాడ

రూరల్‌ నియోజకవర్గంలో CMRF ద్వారా రూ. 3.44 కోట్ల వైద్య సాయం:* *పేద ప్రజల ఆపద్బాంధవులు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు*

ఆరోగ్యాంధ్ర ప్రదేశే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో నేటివరకు సుమారు 353 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకున్నారు. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ శాసన సభ్యుల వారి కార్యాలయం నందు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 18 (పద్దెనిమిది) మందికి రియంబర్స్మెంట్ మరియు 2 (ఇద్దరికీ) LOCలతో కలిపి మొత్తం 20 మందికి మంజూరు అయిన 19,35,426/- రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు శ్రీ పంతం సందీప్ గారు కూటమి నాయకులు చిక్కాల రామచంద్ర రావు గారు, డా. చప్పిడి వెంకటేశ్వర రావు గారు, పితాని లీల గారు, బోళ్ళ కృష్ణ మోహన్ గారు, వల్లూరి రాజా గారు, నల్లే ప్రసన్న కుమార్ గారు, మట్టపర్తి ప్రకాష్ గౌడ్ గారు, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, కరెడ్ల గోవింద్ గారు, బండారు మురళి గారు, తిరుమాని కుమార స్వామి గార్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుండి సీఎంఓ కార్యాలయానికి 500 అప్లికేషన్స్ పంపించగా ఈనాటికి సుమారు 353 మందికి 3,44,08,099/-రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన 147 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నల్లం శ్రీరాములు గారు, అద్దంకి వీరబాబు గారు, ర్యాలీ సతీష్ గారు, తాటికాయల వీరబాబు గారు, పుల్ల శ్రీరాములు గారు, పుల్ల వీరబాబు గారు, సోదే ముసలయ్య గారు, పితాని గన శివ తేజ గారు, గరికిన సురేష్ గారు, వానపల్లి వెంకట రమణ గారు, గరగ శ్రీనివాస్ గారు, గంటా నాని బాబు గారు, రామిశెట్టి సునీల్ గారు, తోటకూర సతీష్ గారు, చోల్లు ఇమ్మాన్యుయేల్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, వాసంశెట్టి త్రిమూర్తులు గారు, వాసంశెట్టి వెంకటేశ్వర రావు గారు, లావణ్య గారు, డి స్వాతి గారు, సుందర సత్తిబాబు గారు, గంజా వర ప్రసాద్ గారు, మారెళ్ల శివ గారు, యలమంచిలి భాస్కర రావు గారు, కనపర్తి చిన్న గారు, శాండీ గారు, గరగ రామ్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, చోడిశెట్టి గంగాధర్ గారు, యర్రంనీడి ప్రసాద్ గారు, పబ్బినీడి ప్రదీప్ గారు, దౌలూరి సత్యనారాయణ గారు, గుమ్మెళ్ల సుబ్రహ్మణ్యం గారు, ఆచంట వీరబాబు గారు, కూటమి శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.